కొంచెం లేట్ అయినా టేస్ట్ మిస్సవ్వ‌లేదు


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 2012 సంవత్సరానికి గానూ ఈ అవార్డులను ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సహజనటి జయసుధ అధ్యక్షతన ఏర్పాటయిన ఈ కమిటీ అవార్డులను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మురళిమోహన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జయసుధ మాట్లాడుతూ.. అవార్డుల ఎంపిక చాలా కష్టంతో కూడకున్న పని అన్నారు. చివర్లో మురళి మోహన్ మాట్లాడుతూ.. రెండు నెలల పాటు కష్టపడి మంచి చిత్రాలను ఎంపిక చేశారని జయసుధతో పాటు కమిటీ సభ్యులను అభినందించారు.


 2012 నంది అవార్డులు


మొదటి ఉత్తమ చిత్రం- ఈగ


రెండో ఉత్తమ చిత్రం - మిణుగురులు


మూడో ఉత్తమ చిత్రం - మిథునం


ఉత్తమ కుటుంబ కథా చిత్రం- ఇష్క్‌


పాపులర్‌ చిత్రం- జులాయి


  ఉత్తమ సినీ విమర్శకుడు-మామిడి హరికృష్ణ


ఉత్తమ నటుడు- నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)


ఉత్తమ నటి- సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)


ఉత్తమ దర్శకుడు- రాజమౌళి (ఈగ)


ఉత్తమ సహాయనటుడు- అజయ్ (ఇష్క్‌)


ఉత్తమ విలన్‌-సుదీప్‌ (ఈగ)


 ఎస్వీ రంగారావు అవార్డు- ఆశీష్ విద్యార్థి (మిణుగురులు)

అల్లు రామలింగయ్య అవార్డు- రఘుబాబు (ఓనమాలు)


ఉత్తమ కొత్త దర్శకుడు- అయోధ్య కుమార్‌ (మిణుగురులు)


ఉత్తమ స్క్రీన్‌ప్లే- రాజమౌళి (ఈగ)


ఉత్తమ కెమెరామ్యాన్‌- సెంథిల్‌ కుమార్‌


ఉత్తమ సంగీత దర్శకులు- ఇళయరాజా, ఎంఎం కీరవాణి


ఉత్తమ గాయకుడు- శంకర్‌ మహదేవన్‌


ఉత్తమ గాయకురాలు- గీతామాధురి


ఉత్తమ ఎడిటర్‌-కోటగిరి వెంకటేశ్వరరావు


ఉత్తమ డ్యాన్స్‌ మాస్టర్‌- జాని


ఉత్తమ స్టంట్‌ మాస్టర్‌- గణేశ్