అమ్మే కూతురిగా వ‌చ్చిందట‌..


ఎప్ప‌టినుంచో అనుకుంటున్న‌ట్లుగానే ఇవాళ సాయంత్రం ఎన్ క‌న్వెన్ష‌న్స్ లో అగ్ర క‌థానాయిక స‌మంత‌, అక్క‌నేని న‌ట వార‌సుడు నాగ‌చైత‌న్య‌ల నిశ్చితార్థం జ‌రిగింది. హిందూ క్రిస్టియ‌న్ సాంప్ర‌దాయాల ప్ర‌కారం కాబోయే వ‌ధూవ‌రులిద్ద‌రూ ఉంగ‌రాలు మార్చుకుని పెళ్లికి సిద్ధ‌మ‌య్యారు.ఇరు కుటుంబాల స‌న్నిహితులు, ప‌రిమితంగా హాజ‌రైన ప‌లువురు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో చైతూ- స‌మంత ల నిశ్చితార్థం జ‌రిగింది. స‌మంత అక్కినేని వారి ఇంటి కోడ‌లుగా రావ‌డం ప‌ట్ట ఆ కుటుంబ స‌భ్యులు ప‌ట్ట‌రాని ఆనందం వ్య‌క్తం చేశారు.

11

ఇప్పుడు నాగచైతన్య-సమంతల నిశ్చితార్ధం జరిగిపోయింది. 'చెయ్ శామ్' అంటూ ఇద్దరి పేర్లను కలిపి మరీ నాగార్జున ఓ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ తో ప్రత్యేకంగా చేసిన ఓ ట్వీట్ అందరినీ హృదయాలను ఆకట్టుకుంటోంది. 'చెయ్ శామ్.. ఇప్పుడు అధికారికమే. మా అమ్మే ఇప్పుడు నా కూతురు అవుతోంది. ఇంతకంటే ఆనందం ఏముంటుంది' అంటూ ట్వీట్ చేశాడు అక్కినేని నాగార్జున. తనకు పెద్ద కోడలుగా రాబోతోన్న సమంతను.. అటు అమ్మ అంటూనే ఇటు కూతురు అనేశాడు నాగ్. మ‌నం సినిమాలో త‌న‌కు అమ్మ‌గా న‌టించిన స‌మంత‌ను ఇటు రియ‌ల్ లైఫ్ కు అప్లై చేసి, మా అమ్మే కూతురిగా వ‌స్తుంద‌న్నాడు నాగ్.

originalఇదిలా ఉండ‌గా, అఖిల్ మా అన్న‌య్య, నా సోద‌రి .. ప్ర‌పంచంలో అంద‌రికంటే హ్యాపీ త‌మ్ముడిని నేనే.. ల‌వ్ యూ అంటూ త‌న స్టైల్ లో స‌మంత ను కుటుంబంలోకి ఆహ్వానించ‌గా, ద‌గ్గుబాటి రానా నా చిన్న తమ్ముడు నాగ‌చైత‌న్య ఇప్పుడు చాలా ఎదిగాడు. కంగ్రాచ్యులేష‌న్స్ అంటూనే స‌మంత కు త‌మ ఫ్యామిలీ లోకి వెల్‌క‌మ్ అనేశాడు భ‌ల్లాలదేవుడు. మొత్తం మీద ఇంత‌టి గొప్ప కుటుంబాన్ని సంపాదించుకున్న స‌మంతను లక్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చెప్పొచ్చేమో..