స‌మంత కు పేరు పెట్టిన నాగ్ స్టాఫ్


 యువ సామ్రాట్ నాగచైత‌న్య‌, చెన్నై చిన్న‌ది స‌మంత ల‌వ్ లో ప‌డి అందులో స‌క్సెస్ అయిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్ లో త‌న తొలి రీల్ హీరో నే రియ‌ల్ లైఫ్ హీరో కాబోతున్నాడు. ఈ ప్రేమ ప‌క్షుల‌కు ఇద్ద‌రి కుటుంబాల పెద్ద‌లు కూడా ప‌చ్చ‌జెండా ఊపిన సంగ‌తి విదిత‌మే. నాగార్జున కూడా స‌మంత‌ను కోడలిగా, త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ కూతురి వివాహానికి వాళ్ల‌తో తీసుకురావ‌డం, స‌మంత ను అంద‌రికీ ప‌రిచ‌యం చేయ‌డం, నాల్రోజులు ముందు నాగ‌చైత‌న్య‌, స‌మంత, నాగ‌ర్జున ముగ్గురు ఒకే చోట ఒకే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఫోటోలే ఇందుకు సాక్ష్యాలు. 
డిసెంబ‌ర్ లో అఖిల్ కు నిశ్చితార్థం చేసి, జ‌న‌వ‌రి లో నాగ‌చైత‌న్య - స‌మంత ల‌కు పెళ్లి చేయాల‌న్న యోచ‌న‌లో ఉన్నాడ‌ట నాగ్. అయితే స‌మంత ఎప్పుడైతే నేను ప్రేమ‌లో ఉన్నాన‌ని చెప్పిందో, అప్ప‌టి నుంచే సమంత‌కు హీరోయిన్ నుంచి నాగార్జున కోడ‌లిగా ప్ర‌మోష‌న్ ఇచ్చేశారు అభిమానులు. అయితే అన్న‌పూర్ణ స్టూడియోస్ లో మ‌రియు నాగార్జున మిగ‌తా స్టాఫ్ మాత్రం స‌మంత‌కు ఒక‌ కొత్త పేరును పెట్టేసుకున్నారట‌.
అక్కినేని కాంపౌండ్ లో ఇప్పుడు ఈ పేరే మార్మోగుతుంది. స‌మంత వ‌స్తుంద‌ని తెలిస్తే చాలు.. చిన్న మేడ‌మ్ వ‌స్తున్నారు అంటూ, తెగ హ‌డావిడి చేసేస్తున్నార‌ట‌. మొత్తానికి స‌మంత‌కు ఈ పేరు భ‌లేగా ఉందిలెండి..