Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

Nagarjuna Celebrates 30Years In Industry


నాగార్జున‌కు 30 ఏళ్లొచ్చాయి
 
కథానాయకుడిగా నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 30 యేళ్లు అయింది. ఆయన తొలి చిత్రం 'విక్రమ్' ఈ రోజునే విడుదలైంది. వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, 1986 మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్న నాగార్జున.. ఎప్ప‌టిక‌ప్పుడు తానొక ట్రెండ్ సెట్ట‌ర్ అని ఎప్ప‌టిక‌ప్పుడు చాటుకుంటూనే ఉన్నారు. ఎంత మంది కొత్తహీరోలొస్తున్నా త‌న గ్లామ‌ర్ తో వాళ్ల‌కి ధీటైన స‌మాధానం ఇస్తూ ఇప్ప‌టికీ త‌న‌లో కోట్లు క‌లెక్ట్ చేసే స‌త్తా ఉంద‌ని ఊపిరితో చాటి చెప్పాడు.
మనం - సోగ్గాడే చిన్నినాయనా - ఊపిరి... ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. ఈ సందర్భంలోనే ముప్పయ్యేళ్ల నట ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం స్వతహాగా ఆయనకీ ఆయన ఫ్యాన్స్ కి మిక్కిలి సంతోషాన్నిస్తోంది. ఇన్నేళ్లు త‌న న‌ట ప్ర‌యాణంలో త‌న‌కు స‌పోర్ట్ చేసిన కుటుంబానికి, ఫ్యాన్స్ కి, ఫ్రెండ్స్ కి కృత‌జ్ఞ‌త‌లు చెప్పి, మ‌రో 30ఏళ్ల ప్ర‌యాణానికి సిద్ధంగా ఉండ‌మ‌ని పిలుపినిచ్చారు. కానీ ఈ శుభ సంద‌ర్భంలో త‌న అమ్మానాన్న‌ల‌ను బాగా మిస్ అవుతున్నాని నాగ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా చెప్పాడు. బాలకృష్ణ , వెంకటేశ్ లతో పోటీపడుతూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకున్నారు. అలా నటుడిగా 30 సంవత్సరాలను పూర్తిచేసుకున్న నాగార్జున ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అమలతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి, సుదీర్ఘకాలం పాటు తన కెరియర్ కొనసాగుతూ ఉండటానికి కారణమైన అభిమానులకు .. సన్నిహితులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నాగ్ కోరుకున‌ట్లే త‌న కెరీర్ మ‌రో 30 ఏళ్లపాటు తెలుగు సినిమా ఉనికిని చాటాల‌ని, మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆశిద్దాం.