నాగ‌శౌర్య‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి..


ఒక సినిమా ప్రారంభోత్స‌వం నుంచి విడుద‌ల అయ్యేవ‌ర‌కు ఆ సినిమాకు ప్ర‌మోష‌న్స్ చేయ‌డం అన్న‌ది నిర్మాత‌కు ఎంత అవ‌స‌ర‌మో తెలియంది కాదు. అయితే ఆ ప్ర‌మోష‌న్స్ ఏ లెవెల్లో స‌క్సెస్ అవుతాయో అందులో న‌టించిన న‌టీన‌టుల కో ఆప‌రేష‌న్ బ‌ట్టి తెలుస్తుంది. త‌మ సినిమాల‌కు పబ్లిసిటీ ప‌రంగా నిర్మాత‌కు స‌హ‌క‌రించ‌డంలో మ‌హేష్ బాబు, నిఖిల్, సందీప్ కిష‌న్, నాని, మంచు ల‌క్ష్మి త‌దిత‌రులు ముందు వ‌రుస‌లో ఉంటారు. 

న‌టీన‌టులు ఎంత కోఆప‌రేట్ చేస్తే ఆ సినిమా ప్రేక్ష‌కుల‌కు అంత బాగా చేరువ‌వుతుంది. అయితే ఇటీవ‌ల న‌టీన‌ట‌లు వారి చిత్రాల్లో భాగ‌స్వాములు అయిన‌ప్పుడు నిర్మాత బాధ‌లు తెలుస్తున్నాయి అని అనేక ఇంట‌ర్వూల్లో చెప్ప‌డం జ‌రిగింది. అయితే ఇటీవ‌ల ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న నాగ‌శౌర్య చిత్రం త‌న సొంత బ్యాన‌ర‌లో తెర‌కెక్కుతున్న విష‌యం మ‌నకు తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు వేరే ్యాన‌ర్ లో సినిమాలు చేశాడు నాగశౌర్య‌. ప్ర‌మోష‌న్స్ కు ఆర్టిస్ట్ లు రాక‌పోతే ఎలా ఉంటుందో నిర్మాత‌గా ఇప్పుడు అర్థ‌మ‌వుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే త‌న సినిమాల‌కు కేవ‌లం కొన్ని ఛానల్స్ కు మాత్ర‌మే వ‌స్తాను, కొన్ని పేప‌ర్స్ కు మాత్ర‌మే ఇంట‌ర్వూలిస్తానని, త‌న మేనేజ‌ర్ తో చెప్పించిన నాగశౌర్య, ఇప్పుడు త‌న సొంత సినిమాకైనా అంద‌రికీ కో ఆప‌రేట్ చేస్తాడో ముందు ముందు తెలియ‌నుంది. ఏదేమైనా, నిర్మాత‌లు ప‌డే ప్ర‌తి క‌ష్టం నాగశౌర్య‌కు తెలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.