నాగ‌చైత‌న్య, స‌మంత ల పెళ్లి ఇప్పుడు కాదట‌..


అక్కినేని కుర్రాళ్ల పెళ్లిళ్ల గురించి రోజుకో కొత్త అప్ డేట్ వస్తోంది. నాగార్జున చిన్నకొడుకు అఖిల్ పెళ్లి విషయంలో దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది. డిసెంబరు 9న నిశ్చితార్థం హైదరాబాద్ లో చేసేసి.. వచ్చే ఏడాది వేసవిలో రోమ్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది అక్కినేని ఫ్యామిలీ. నిశ్చితార్థం కోసం అతిథుల్ని పిలిచే పనిలో బిజీగా ఉన్నాడు నాగ్. అయితే ఇక మిగిలింది చైయ్, శామ్ ల పెళ్లి, వీళ్ల పెళ్లి గురించే ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ముందు త‌మ్ముడు అఖిల్ పెళ్లి కానిచ్చేసి.. ఆ తర్వాత తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు చైతూ.
 
అఖిల్ పెళ్లి సంగతి తేలిపోవడంతో తన పెళ్లికి కూడా ముహూర్తం చూసుకున్నాడట చైతూ. సమంతతో అతడి పెళ్లి వచ్చే ఏడాది ఆగస్టులో జరుగుతుందని సమాచారం. హిందూ.. క్రిస్టియన్ సంప్రదాయాల్లో రెండుసార్లు పెళ్లి ఉంటుంది కాబ‌ట్టి,  ఆ రెండు డేట్లు కూడా ఫైనలైజ్ చేసేశారట. రెంటికీ గ్యాప్ ఏమీ లేకుండా, వరుసగా రెండు రోజుల్లో ఈ తంతు ముగించేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. అయితే ఇక్క‌డ ముందు చైతూ ఫ్యామిలీకీ ప్రయారిటీ ఇవ్వనున్నారు. మొదట హిందూ సంప్రదాయంలో పెళ్లి కానిచ్చి.. మరుసటి రోజు చెన్నైలోని ఒక చర్చిలో క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం జరిపిస్తారట. సో.. చైతూ-సమంతల పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారట.