Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Naga Chaitanya Romance With Samantha For Fourth Time


Naga chaitanya, Samantha this is a crazy combination in tollywood. Seeing this pair on screen is eye feast. Samantha done a super on-screen romance with Chaithu with her first movie Ye maya chesave and continued with Auto nagar Surya and Manam. Now this combination is coming in front of us once again.
Once Samantha said she feel comfortable working with Chaithu other than any hero's. Now director Kalyan Krishna is ready to set this combination once again for the fourth time. Kalyan Krishna who gave career best hit to Nagarjuna with Soggade chinninayna is now planning a beautiful love story with Chaithu. Already chaithu liked the story and gave green signal to this movie which is going to starts it's shooting form July. Chaitanya after completing Premam and Samantha after completing Janatha garage will join this sets. More details about this movie will come out very soon.
మ‌ళ్లీ జ‌త‌క‌ట్ట‌నున్న క్రేజీ కాంబినేష‌న్
నాగ‌చైత‌న్య‌, స‌మంత‌.. వీరిద్ద‌రిది టాలీవుడ్ లోనే క్రేజీ కాంబినేష‌న్. రియ‌ల్ లైఫ్ లో వీరిద్ద‌రూ ల‌వ‌ర్స్ అన్న‌ విష‌యం ప‌క్క‌న పెడితే మాత్రం ఆన్ స్ర్కీన్ పై వీరిజంట మాత్రం చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. త‌న మొద‌టి సినిమా ఏ మాయ చేశావే లోనే చైతూతో సూప‌ర్బ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన స‌మంత‌.. త‌ర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ వ‌చ్చింది. ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల్లో న‌టించిన ఈ జంట‌, ఇప్పుడు మ‌రోసారి జ‌త‌క‌ట్ట‌నున్నారు.
త‌న‌కు చైతూ తో న‌టించ‌డం కంటే క‌న్వినియెంట్ గా ఎవ‌రితోనూ న‌టించ‌లేన‌ని ఎప్పుడో తెగేసి చెప్పింది స‌మంత‌. ఇప్పుడీ జంట‌ను నాలుగోసారి క‌లుపుతూ మ‌రోసారి రొమాన్స్ పండించేందుకు డైర‌క్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ సిద్ధ‌మ‌వుతున్నాడు. సోగ్గాడే చిన్ని నాయ‌నాతో నాగార్జునకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన ఈ ద‌ర్శ‌కుడు, నాగ‌చైత‌న్య‌తో ఓ బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే స్టోరీ న‌చ్చేసి, గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా, జులై నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ప్రేమ‌మ్ పూర్త‌యిన వెంట‌నే చైతూ, జ‌న‌తా గ్యారేజ్ పూర్త‌యిన త‌ర్వాత స‌మంత ఈ షూటింగ్ లో పాల్గొన‌నున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.