ఆయ‌న ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటారు..


నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపోస‌. మిర్యా స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం చిత్ర‌యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో... హీరో నాగ‌చైత‌న్య మాట్లాడుతూ ` రెండు, మూడు రోజుల్లో సినిమా సెన్సార్ జ‌రుపుకోనుంది. ఆడియో స‌క్సెస్ చేసిన విధంగానే సినిమాను కూడా పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను. గౌత‌మ్ మీన‌న్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న ప్ర‌తిసారి ఏదో ఒక కొత్త విష‌యం నేర్చుకుంటూనే ఉన్నాను. న‌న్ను ఎప్పుడో ఏదో ఒక కొత్త స్ట‌యిల్‌లో ప్రెజెంట్ చేస్తుంటారు. అందుకు గౌత‌మ్ మీన‌న్ గారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఏ మాయ చేశావే సినిమాకు ఎక్సెటెన్ష‌న్‌గా నా క్యారెక్ట‌ర్ ఈ సినిమాలో ఉంటుంది. నవంబ‌ర్ 11న విడుద‌ల కానుంది`` అన్నారు. నిర్మాత మిర్యాల రవీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ - ``గౌత‌మ్‌, చైత‌న్య కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఏ మాయ చేశావే సినిమా ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో మ‌న‌కు తెలిసిందో. గౌత‌మ్‌మీన‌న్‌గారు డైరెక్ట్ చేసిన ఏ మాయ చేశావే, ఘ‌ర్ష‌ణ సినిమాలు నాకెంతో ఇష్ట‌మైన‌వి. ఈ రెండు సినిమాల కాంబినేష‌న్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌లో సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా ఉంటుంది`` అన్నారు. కోన‌వెంక‌ట్ మాట్లాడుతూ - ``నేను ఎంతో మంది దర్శ‌కుల‌తో వ‌ర్క్ చేశాను. నా ఇర‌వైయేళ్ళ కెరీర్‌లో గౌత‌మ్‌మీన‌న్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర్క్ చేయ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతినిచ్చింది. ఎందుకంటే ఆయ‌న అంద‌రి ద‌ర్శ‌కుల్లాగా క‌థ‌తో పాటు క‌థ‌లోని సోల్‌ను బాగా న‌మ్ముతారు. ఏ మాయ చేశావే సినిమాలో నెక్ట్స్ డోర్ బాయ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన నాగ‌చైత‌న్య ఈ సినిమాలో చాలా డిప‌రెంట్‌గా క‌న‌ప‌డ‌తాడు. ఈ సినిమా ట్రైల‌ర్‌లో ప్రేక్ష‌కులు చూసింది ఒక శాతం మాత్ర‌మే సినిమాలో ఇంకా చాలా మంచి కంటెంట్ ఉంది. ఇప్పుడున్న ట్రెండ్‌కు ద‌గ్గ‌ర‌గా, మ‌న సినిమాలుండే ఫార్ములాకు దూరంగా ఉండే సినిమా `సాహ‌సం శ్వాస‌గా సాగిపో``` అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ - ``సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాను ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌గారు ఒక‌టిన్న సంవత్స‌రం పాటు చాలా ప్యాష‌న్‌తో తీశారు. నిన్న‌నే సినిమా చూశాను. ఏ మాయ చేశావే స్ట‌యిల్‌లో ఫ‌స్టాఫ్ క్యూట్‌గా, సెకండాఫ్ ఘ‌ర్ష‌ణ స్ట‌యిల్‌లో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో క‌ల‌గ‌లిసిన సినిమా ఇది. సాంగ్స్ అన్నీ ఫ‌స్టాఫ్‌లోనే వ‌స్తాయి. సెకండాఫ్‌లో చాలా థ్రిల్లింగ్‌గా సాగిపోతుంది. సినిమా న‌వంబ‌ర్ 11న రిలీజ్ అవుతుంది`` అన్నారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - ``నాగ‌చైత‌న్, మంజిమ మోహ‌న్‌, గౌత‌మ్‌మీన‌న్‌, నిర్మాత ర‌వీంద‌ర్‌రెడ్డిగారి కెరీర్‌లో ఈ సినిమా సూప‌ర్‌హిట్ మూవీగా నిలిచిపోతుంది. యూత్ బాగా ఎంజాయ్ చేసే ఫ్రెష్ కంటెంట్ ఉన్న సినిమా `సాహసం శ్వాస‌గా సాగిపో``` అన్నారు. గౌత‌మ్‌మీన‌న్ మాట్లాడుతూ - ``సినిమా న‌వంబ‌ర్ 11న విడుద‌ల‌వుతుంది. నేను చేస్తున్న 18వ సినిమా. కార‌ణాలు తెలియ‌లేదు కానీ సినిమా ఆల‌స్య‌మైంది. చైతు పెర్‌ఫార్మెన్స్ అదిరిపోయింది. దిల్‌రాజు, బెల్లంకొండ సురేష్ సినిమా చూసి బాగుంద‌న‌డంతో చాలా హ్యాపీగా అనిపించింది. ఏ మాయ చేశావే నెక్ట్స్ లెవ‌ల్ మూవీ ఇది. ఏ మాయ చేశావేలో అబ్బాయి ఈ సినిమాలో మ‌గాడు అయిన త‌ర్వాత ఎలా బిహేవ్ చేస్తాడ‌నేలా సినిమా ల‌వ్‌, యాక్ష‌న్‌, థ్రిల్లింగ్‌గా ఉంటుంది`` అన్నారు. మంజిమ మోహ‌న్ మాట్లాడుతూ - ``నాపై న‌మ్మ‌కంతో నాకు అవ‌కాశం క‌లిగించిన గౌత‌మ్ మీన‌న్‌గారికి థాంక్స్‌. మంచి టీంతో వ‌ర్క్ చేశాను. రెహ‌మాన్‌గారి మ్యూజిక్ పెద్ద హిట్ అయ్యింది. సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్‌ ఆర్థర్‌, ఎడిటింగ్‌: ఆంటోని, ఆర్ట్‌: రాజీవన్‌, ఫైట్స్‌: సిల్వ, రచన: కోన వెంకట్‌, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌.