Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Naga Chaitanya In A..Aa Movie


We all know that Nithin and Samantha as hero heroines acted in a movie called A..Aa which is going to release tommaro.So, you can see Naga Chaitanya on the screen.Dont get surprised.Naga chaitanya is relesing theatrical trailer of his latest movie Sahasam Swasaga sagipoo today evening.so, from tommaro this trailer will be played in all the theaters in which A..Aa is playing.Gowtam menon is Director of this movie in wich Nagachaitanya and Manjima mohan are hero heroines.Fans are eagerly waiting for this movie which is shooting since many days.But Gowtam menon is delaying. This is a bilingual movie with both different heros,This may be the reason for the delay.At last total shooting of the movie completed and going to release very soon.Already two songs of the movie released in youtube.Again they are coming with theatrical trailer.So, we cannot expect any audio function specially for this film.

అ..ఆ లో మెర‌వనున్న నాగ‌చైత‌న్య‌..
 
 అ..ఆ, నితిన్, స‌మంత జంట‌గా న‌టించిన ఈ సినిమా రేపు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మ‌ధ్య‌లో నాగ‌చైత‌న్య కూడా క‌నిపిస్తాడ‌ట‌. అదేంటి. నితిన్ సినిమాలో నాగ‌చైత‌న్య న‌టించాడా అని ఆశ్చ‌ర్య‌పోకండి. రేపు అ..ఆ మూవీ రిలీజ్ కానుంద‌న్న విష‌యం తెలిసిందే. దీనికి తోడు నాగ‌చైత‌న్య ఇవాళ సాయంత్రమే ఆన్ లైన్ లో సాహ‌సం శ్వాస‌గా సాగిపో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేస్తున్నాడు. సో రేప‌ట్నుంచి అ..ఆ థియేట‌ర్ల‌లోనూ ఆ ట్రైల‌ర్ ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. నాగ‌చైత‌న్య‌, మంజిమా న‌టించిన ఈ చిత్రానికి గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చాలా రోజులుగా సెట్స్ పై ఉన్న ఈ చిత్రం గురించి అభిమానులు ఎంతో కాలంగా ఆతృత‌తో ఎదురుచూస్తున్నారు. కానీ గౌత‌మ్ మీనన్ మాత్రం సినిమాని ఎంత‌కీ ముందుకు తీసుకురావ‌డం లేదు.
తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఇద్ద‌రు హీరోల‌తో తెర‌కెక్కుతున్న చిత్రం కాబ‌ట్టి షూటింగ్ లేట‌వ్వ‌డంతో సినిమా ఆల‌స్యంగా పూర్త‌యింది. ఎట్ట‌కేల‌కు సినిమాను పూర్తి చేసిన గౌత‌మ్ మీన‌న్ త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్షకుల ముంద‌కు తీసుకురానున్నాడు. ఆడియ ఫంక్ష‌న్ లో అది కూడా ఆఖ‌ర్లో కానీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేయ‌ని త‌రుణంలో ఇప్ప‌టికే ఆన్ లైన్ రెండు పాట‌ల్ని విడుద‌ల చేశారు, మ‌ళ్లీ ఇప్పుడు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ అంటున్నారు. అంటే ఆడియో లాంచ్ అంటూ స్పెషల్ గా ఏమీ ఉంటుందో ఉండ‌దో డౌటే.