Latest News

వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే టీఎస్‌ఎఫ్‌టీవీ అండ్‌ టీడీసీ చైర్మన్‌గా నియమితులైన పుస్కూర్‌ రామ్మోహన్‌కి దాసరి కిరణ్‌కుమార్‌ అభినందనలు "మెంటల్ మదిలో" చిత్రంలోని అరవింద్ కృష్ణ పాత్ర పరిచయం విజయ్ అదిరింది ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్… జూలై 14న 'దండుపాళ్యం-2' ​

Naga Chaitanya Again Comes With Song Teaser


మ‌రో సాంగ్  టీజ‌ర్ తో వచ్చిన చైతూ..
  సినిమా ఎప్పుడో ఆరు నెల‌ల ముందు రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ ఎందుకో కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు సినిమా వాయిదా ప‌డుతూనే వస్తోంది. అయినా సినిమా మీద క్రేజ్ ఏమీ తగ్గలేదు. ఎందుకు త‌గ్గుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివ‌ర‌కు జనాలకు పరిచయం చేసిన ప్రతి విశేషం ఆకట్టుకునేలా ఉంటుంటే. ఫస్ట్ టీజర్, త‌ర్వాత సెకండ్ టీజ‌ర్.. ఆపై ఎల్లిపోమాకే సాంగ్.. అన్నీ కూడా చాలా రిచ్ గా, ఆస‌క్తిక‌క‌రంగా ఉంటూ.. సినిమా మీద ఆసక్తిని పెంచాయి. ‘ఎల్లిపోమాకే..’ పాట రిలీజైన నాటి నుంచి ఎఫ్ఎం రేడియోల్లోనూ, సంగీత ప్రియుల మొబైల్స్ లోనూ మార్మోగుతూనే ఉంది. ఇప్పుడు ఇంకో కొత్త పాటతో జనాల ముందుకొచ్చాడు చైతూ. ఈ రోజే ‘సాహసం శ్వాసగా సాగిపో’లోని మరో పాట ‘షోకిల్లా’ ఆడియో టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఫాస్ట్ బీట్ తరహాలో ఉంది. ఈ పాట మేకింగ్ విజువల్స్ కూడా యాడ్ చేసి టీజర్ రిలీజ్ చేశారు. రాబోయే రెండు వారాల్లో కూడా సినిమాలోని మిగతా పాటల టీజర్లు కూడా వరుసగా రిలీజ్ చేస్తార‌ట‌. ఈ నెల మూడో వారంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆడియో విడుదల కాబోతోంది. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ‘ఏమాయ చేసావె’ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో మలయాళీ భామ మాంజిమా మోహన్ కథానాయిక. తమిళంలో ఇదే సినిమాను శింబు కథానాయకుడిగా తెరకెక్కిస్తున్నాడు గౌతమ్. జూన్లో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. Watch Shokilla Song Teaser Here https://www.youtube.com/watch?v=yx3Sf0TSoMw