స‌మంత మతం మార‌లేద‌ని క్లారిటీ ఇచ్చిన‌ నాగ చైత‌న్య‌


యువ సామ్రాట్ నాగచైత‌న్య‌, చెన్నై చిన్న‌ది స‌మంత ల‌వ్ లో ప‌డి అందులో స‌క్సెస్ అయిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్ లో త‌న తొలి రీల్ హీరో నే రియ‌ల్ లైఫ్ హీరో కాబోతున్నాడు. ఈ ప్రేమ ప‌క్షుల‌కు ఇద్ద‌రి కుటుంబాల పెద్ద‌లు కూడా ప‌చ్చ‌జెండా ఊపిన సంగ‌తి విదిత‌మే. వీరిద్ద‌రి ప్రేమ‌ సంగతి కొద్దిరోజులుగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది.వాళ్ల‌కు సంబంధించిన ఏ చిన్న విష‌యం బ‌య‌టికొచ్చినా, అది అటు తిరిగి ఇటు తిరిగి పెద్ద సంచ‌ల‌నంగా మారుతుంది.
రీసెంట్ గా వారిద్దరూ వేద పండితుల సమక్షంలో కూర్చొని పూజ నిర్వహించిన ఫోటోలు కొన్ని బయటకొచ్చాయి. దాంతో అందరూ ఇదేదో పెళ్ళికి సంబంధించిన పూజా కార్యక్రమంలా ఉందని అన్నారు. చివరికి ఆ పూజ సమంత క్రిస్టియన్ మతం నుండి హిందూ మతంలోకి మారుతూ నిర్వహించిన పూజని ఫిక్స్ చేశారు.
కానీ ఈ విషయంపై నాగ చైతన్య పూర్తి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన మాట్లాడుడుతూ ‘ నేను, సమంత ఖాళీగా ఉండటం వల్ల స్టూడియోకి వెళ్లాం. అక్కడ నాన్నగారు ఏదో పూజ చేస్కుంటూ మమ్మల్ని కూడా కూర్చోమన్నారు. అంతేకాని అవి మా నిశ్చితార్థం ఫోటోలు కావు, స‌మంత మ‌తం మార్చుకున్న‌వీ కావు. నాకు స‌ర్వ‌మ‌తం స‌మ్మ‌త‌మే. నేను ఒక వ్య‌క్తిని ప్రేమించిన‌ప్పుడు వారి ఇష్టాయిష్టాల‌ను ప్రేమిస్తాను, గౌర‌విస్తాను. మ‌తం మార్చుకోమ‌నో, ఇంకోట‌నో చెప్ప‌ను. నాకు మ‌నిషి ముఖ్యం’ అంటూ క్లారిటీ ఇచ్చారట.