My Next Movie Also With Trivikram


Every genre audience likes Trivikram movies.Because Trivikram impresses everyone with his movie.So he got one more success again with A Aa.not only in both telugu states but also in overseas appreciating this movie.this producer Radha Krishna previously Done Julai,Son of Satyamurthi with trivikram and now with A Aa they got  hatrick.Radha Krishna said he want to work with Trivikram again for his next movie.
 
త‌ర్వాత సినిమా కూడా త్రివిక్ర‌మ్ తోనే చేస్తాడ‌ట‌..
మాట‌ల‌తో మాయ చేయ‌గల త్రివిక్ర‌మ్ సినిమా అన‌గానే అన్నివ‌ర్గాల వారికి ఆస‌క్తి ఏర్ప‌డుతుంది. అంద‌రికీ కావ‌ల‌సిన అంశాల‌ను అందించ‌డమే దానికి కార‌ణం. అందుకే అ..ఆతో మ‌రోసారి స‌క్సెస్ అందుకున్నాడు త్రివిక్ర‌మ్. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమాకు తెలుగు రాష్ర్టాల్లోనే కాదు, ఓవ‌ర్సీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాకు నిర్మాతగా  వ్య‌వ‌హ‌రించిన రాధాకృష్ణ గ‌తంలో త్రివిక్ర‌మ్ తో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వంటి సినిమాల‌ను కూడా నిర్మించి అ..ఆ తో ఇద్ద‌రూ హ్యాట్రిక్ కొట్టారు. త‌మ కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ రావ‌డం ప‌ట్ల స్పందించిన రాధాకృష్ణ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ, త‌న నెక్స్ట్ సినిమా కూడా త్రివిక్ర‌మ్ తోనే చేస్తాన‌ని చెప్పారు. దీంతో ఆ సినిమాలో తారాగ‌ణం గురించి అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది.