ఎన్టీఆర్ చిత్రానికి ముహుర్తం ఫిక్స్


జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ - బాబీ కాంబినేష‌న్ లో ఒక సినిమా తెర‌కెక్కనున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న లాంఛ్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 10న లాంచ్, ఫిబ్ర‌వ‌రి 15 నుంచి రెగ్యుల‌ర్ షూట్ ఉంటుంద‌ని అధికారిక ప్ర‌క‌టన చేశాడు నిర్మాత క‌ళ్యాణ్ రామ్.

ntr27టెంప‌ర్, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ వంటి స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్, త‌న త‌దుప‌రి సినిమా వీటన్నింటికీ మించేలా ఉండాల‌నే ఉద్దేశ్యంతోనే చాలా క‌థ‌ల‌ను విన్నాడు. చివ‌ర‌కు బాబీ చెప్పిన స్టోరీ కొత్త‌గా ఉండ‌టంతో వెంట‌నే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేయ‌నున్న ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

https://www.youtube.com/watch?v=VcuQPnsW68A