ఆ సినిమా మోక్ష‌జ్క్ష‌కే కరెక్ట్..


బాల‌య్య 100వ చిత్రంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి మంచి క‌లెక్ష‌న్సే రాబ‌ట్టుకుంటుంది. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ,  త‌న త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్క్ష తెరంగేట్రం ఈ ఏడాది చివ‌ర్లోనే ఉంటుంద‌ని, మొద‌ట్లో ల‌వ‌ర్ బాయ్ గా ప్రేమ క‌థా చిత్రాల‌నే తీసినా, త‌ర్వాత మాత్రం త‌మ దారిలోనే న‌డుస్తాడ‌ని, కేవ‌లం ల‌వ‌ర్ బాయ్ గానే కొన‌సాగితే త‌మ ఫ్యాన్స్ ఒప్పుకోరు అంటూ చెప్పాడు బాల‌య్య‌.
 
అయితే మోక్ష‌జ్క్ష మొద‌టి సినిమాను తెర‌కెక్కించేది ఏ డైర‌క్ట‌ర్ అయినా స‌రే, క్రిష్ తో మాత్రం మోక్ష‌జ్క్ష ఒక సినిమా ఖ‌చ్చితంగా చేయ‌నున్నాడ‌నే టాక్ మాత్రం కాస్త గ‌ట్టిగానే  వినిపిస్తోంది. ప్ర‌స్తుతం గౌత‌మిపుత్ర  శాత‌క‌ర్ణి విజ‌యాన్ని ఆస్వాదిస్తున్న క్రిష్, త‌ర్వాత శాత‌క‌ర్ణి కొడుకు అయిన పులోమావి చ‌రిత్రను సినిమాగా తెర‌కెక్కించాల‌నే  ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట క్రిష్‌. ఈ సినిమా శాత‌క‌ర్ణికి సీక్వెల్ ఉండనుంద‌ని, శాత‌క‌ర్ణి పాత్ర‌ను బాల‌య్య పోషించారు కాబ‌ట్టి, పులోమావి పాత్ర‌ను త‌న వార‌సుడు మోక్షజ్క్ష చేయ‌డ‌మే క‌రెక్ట్ అని స‌న్నిహితులు చెప్పడంతో, మోక్ష‌జ్క్ష‌తో ఆ సినిమా చేయడం కోసం క్రిష్‌, బాల‌య్య స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.
 
ఇదిలా ఉండ‌గా,శాత‌క‌ర్ణి విజ‌యం త‌ర్వాత క్రిష్ తో సినిమాలు చేయడానికి అంద‌రూ హీరోలు ముందుకు వ‌స్తున్నారు. క్రిష్ త‌ర్వాతి సినిమాలు వెంక‌టేష్, రామ్ చ‌ర‌ణ్ తో తీయాల్సి ఉండ‌గా, మ‌రి పులోమావి చ‌రిత్రను తెర‌కెక్కించాలంటే ఇంకాస్త స‌మ‌యం ప‌ట్ట‌నుంది అర్థ‌మ‌వుతంది.