Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

మోహన్ లాల్ ద‌గ్గ‌ర ''బ్లాక్ మ‌నీ''..


జనతాగ్యారేజ్,  `మ‌న్యం పులి` సినిమాలతో  తెలుగులోనూ అభిమానులను సాధించ కున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్.ఆయన హీరోగా   ఏ సినిమా వ‌స్తోంది అన్న క్యూరియాసిటీ తెలుగు ప్రేక్ష‌కుల్లో కాస్త ఎక్కువగానె ఉంది.. ఆ క్యూరియాసిటీని మ‌రింత రెయిజ్ చేసేలా, ఆద్యంతం థ్రిల్‌కి గురిచేసే మ‌రో మైండ్ బ్లోవింగ్ మూవీ మోహ‌న్‌లాల్ నుంచి వ‌స్తోంది. ఈ సినిమా టైటిల్ `బ్లాక్‌మ‌నీ`. `.. అన్నీ కొత్త నోట్లే` అన్న‌ది ఉప‌శీర్షిక‌. నిజామ్ స‌మ‌ర్ప‌ణ‌లో మాజిన్ మూవీమేక‌ర్స్ ప‌తాకంపై స‌య్య‌ద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈనెల‌లోనే సినిమా రిలీజ్ కానుంది. 


ఈ సంద‌ర్భంగా నిర్మాత నిజాముద్దీన్ మాట్లాడుతూ -``మోహ‌న్‌లాల్ న‌టించిన ఈ క్రేజీ సినిమాకి ప్ర‌స్తుతం అనువాదం జ‌రుగుతోంది. వెన్నెల‌కంటి సంభాష‌ణ‌లు అందించారు. ఇప్ప‌టికే సెన్సార్ ప‌నులు సాగుతున్న‌ ఈ చిత్రాన్ని ఈనెల‌లోనే రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. సీనియ‌ర్ దర్శ‌కుడు జోషి ఈ సినిమాని అద్భుత‌మైన గ్రిప్‌తో తెర‌కెక్కించారు. డీమానిటైజేష‌న్ త‌ర్వాత అన్నిచోట్లా బ్లాక్‌మ‌నీ గురించే చ‌ర్చ సాగుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు న‌ల్ల‌దొర‌లు కొత్త క‌రెన్సీతో అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ‌వుతోంది. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ష్యూర్‌షాట్ హిట్‌`` అన్నారు. ఈ చిత్రంలో మోహ‌న్‌లాల్ స‌ర‌స‌న అమ‌లాపాల్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, సాయికుమార్ విల‌న్‌గా న‌టించారు.