Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

మోహన్‌లాల్‌- సత్యరాజ్‌ "ఇద్దరూ ఇద్దరే"!!


మోహన్‌లాల్‌- సత్యరాజ్‌ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. వీళ్ళిద్దరూ కలిసి నటించిన మలయాళ చిత్రం ‘లైలా.. ఓ లైలా’. ప్రముఖ మలయాళ దర్శకుడు జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధించింది. అమలాపాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఇద్దరూ ఇద్దరే’ పేరుతో అనువదిస్తున్నారు. రాహుల్‌దేవ్‌, సోనూసూద్‌ ప్రతినాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని కె.ఆర్‌.ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై కందల కృష్ణారెడ్డి ‘ఇద్దరూ ఇద్దరే’గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ధియేటర్ ట్రైలర్ కు విశేషమైన స్పందన వస్తోంది. "ప్రేమమ్" ఫేమ్  గోపిసుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోను త్వరలో విడుదల చేసి.. నవంబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చెందుకు నిర్మాత కందల కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనమంతా’, ‘జనతా గ్యారేజి’ చిత్రాల్లో నటించడానికి ముందే మోహన్‌లాల్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఇక ‘మిర్చి’, ‘బాహుబలి’ చిత్రాలతో సత్యరాజ్‌కు తెలుగులో ఏర్పడిన క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరూ పవర్‌ఫుల్‌ పాత్రలు పోషించిన చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’. అలాగే ఈ చిత్రంలో మోహన్‌లాల్‌కు జంటగా నటించిన అమలాపాల్‌ గ్లామర్‌ ఒలికించడంతోపాటు పర్‌ఫార్మెన్స్‌కు స్కోపున్న మంచి క్యారెక్టర్‌ చేసింది. మోహన్‌లాల్‌, సత్యరాజ్‌, అమలాపాల్‌తో పాటు రమ్య నంబిసన్‌, రాహుల్‌దేవ్‌, సోనూసూద్‌ తదితర సుపరిచితులు నటించిన సినిమా కావడంతో ..  డబ్బింగ్‌ సినిమాలా కాకుండా స్ట్రయిట్‌ సినిమా చూస్తున్న అనుభూతికి ప్రేక్షకులు లోనవుతారు.  ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వస్తోంది.  అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఆడియో విడుదల చేసి, నవంబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.లోకనాథన్‌, ఎడిటింగ్‌: శ్యాం శశిధరన్‌, సంగీతం: గోపి సుందర్‌, నిర్మాణ నిర్వహణ: డి.నారాయణ, నిర్మాత: కందల కృష్ణారెడ్డి, దర్శకత్వం: జోషి!!