Mohan Babu Assembly Rowdy Completes 25 Years


Assembly Rowdy which created sensations with the title.Mohan babu got a name "Collection king" with this film.In those days positive talk is enough for Mohan babu film for collect more than any top hero.25 years completed till now for Assembly Rowdy.Mohan babu shared some moments about the film.
He said "He was already in good form with "Alludu garu" when I thought to do this movie with B.Gopal everyone said no,but I totally believed in him and went forward. We thought of Divya barathi as heroine but she has many complaints that she will not come to sets in time and she has many demands but I didn't believed all those and approached her she accepted and did the film.And you all know the result."
The name itself has controversy so he said he shown the movie to all politicians. If the movie releases now also it is not wrong,we feel the story is fresh.
అసెంబ్లీ రౌడీకి పాతికేళ్లు..
 
అసెంబ్లీ రౌడీ. పేరుతోనే సంచ‌లనం సృష్టించిన సినిమా. క‌లెక్ష‌న్ కింగ్ గా పిలుచుకునే మోహ‌న్ బాబును ఇప్పుడైతే విల‌క్ష‌ణ న‌టుడు అంటున్నారు కానీ, అప్ప‌ట్లో ఆయ‌న సినిమాకు పాజిటివ్ టాక్ చాలు. నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ లో ఉన్న హీరోకంటే ఎక్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టేవారు. అసెంబ్లీ రౌడీ విడుదలైన ఇప్పటికి పాతికేళ్లు పూర్తయింది. ఈ సినిమా గురించి.. అప్పటి కబుర్లను మోహన్ బాబు పంచుకున్నారు.
 'అప్పటికే అల్లుడుగారుతో నేను మళ్లీ ఫాంలోకి వచ్చాను. బి.గోపాల్ దర్శకత్వంలో ఈ చిత్రం చేయాలని అనుకున్నపుడు.. చాలామంది హెచ్చరించారు. అయినా సరే.. నాకు ఆయనపై నమ్మకం ఉంది. అలాగే హీరోయిన్ గా దివ్యభారతిని తీసుకుందామని అనుకుంటే.. తను సెట్స్ కి టైమ్ కి రాదని బోలెడన్ని డిమాండ్స్ చేస్తుందని అన్నారు. నేను వాటిని నమ్మకుండా అప్రోచ్ అయ్యాను. ఆమె వెంటనే ఒప్పుకుని సినిమా చేసింది. ఇక రిజల్ట్ అందరికీ తెలిసిందే' అన్నారు మోహన్ బాబు. పేరులోనే కాంట్ర‌వ‌ర్సీ ఉన్న ఈ సినిమాను అప్ప‌టి పొలిటిక‌ల్ లీడ‌ర్స్ అంద‌రికీ చూపించానన్నారు మోహ‌న్ బాబు. ఏ మాట‌కి ఆ మాట చెప్పుకోవాలి కానీ, అసెంబ్లీ రౌడీ స్టోరీ ఎంత ఫ్రెష్ గా ఉంటుందంటే.. ఇప్పుడు తీసినా అది కరెక్ట్ స్టోరీనే అనిపిస్తుంది.