శ్రీను వైట్ల‌కు అంత సీన్ లేదు


ఓవ‌ర్సీస్ లో స్టార్ హీరోలు మిన‌హాయించి, హీరో్ల కంటే డైర‌క్ట‌ర్స్ కే ఎక్కువ ప్రాధాన్యం అన్న‌ది వాస్త‌వం. కెప్టెన్ ఆఫ్ ది షిప్ కే వాళ్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోవ‌డంలో శ్రీను వైట్ల‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. దూకుడు, బాద్‌షా వంటి సినిమాల‌తో అక్క‌డ వైట్ల బాగానే ఫేమ్ అయ్యాడు. కానీ త‌ర్వాత శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆగ‌డు, బ్రూస్ లీ చిత్రాల‌కు మాత్రం సీన్ రివర్స్ అయింది. ఆడియ‌న్స్ అంచ‌నాల‌ను అందుకోలేక పోగా,తీవ్ర నిరుత్సాహ ప‌రిచాయి ఈ రెండు సినిమాలు. దీంతో సేమ్ క‌థ‌లతో రొటీన్ సినిమాలు తీస్తున్న శ్రీను వైట్ల‌ను అక్క‌డి సినీ ప్రియులు ప‌ట్టించుకోవ‌డం మానేశారు. అయితే ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మిస్ట‌ర్ సినిమాతో అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడ‌న్న‌దే ప్ర‌శ్న‌గా మారింది. 

ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ తో ఫ్రెష్ ఫీల్ క్యారీ చేసి, పాజిటివ్ టాక్ సంపాదించిన వైట్ల‌, ట్రైల‌ర్ తో మ‌ళ్లీ రొటీన్ అనే ఫీలింగ్ ను తీసుకొచ్చాడు. అయితే మెగా హీరో సినిమాల‌కు అక్క‌డ మార్కెట్ బాగానే ఉంటుంది కానీ, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఇంకా ఆ రేంజ్ ను అందుకోలేద‌నేది వాస్త‌వం. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏదో మెగా ఫ్యాన్ బేస్ తో ఓపెనింగ్స్ తీసుకురావచ్చు కానీ ఓవ‌ర్సీస్ లో మాత్రం ఇలాంటివి క‌ష్ట‌మే. ఎలా అనుకున్నా,మిస్ట‌ర్ పాజిటివ్ టాక్ వ‌స్తే త‌ప్ప ఓవ‌ర్సీస్ లో నెగ్గుకురావ‌డం క‌ష్ట‌మే