Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

మార్చి 3న `మెట్రో` విడుద‌ల‌


ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన సినిమా -`మెట్రో`. ర‌జ‌ని తాళ్లూరి నిర్మాత‌. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను  కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి, పోస్ట‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత గాయ‌ని గీతామాధురి ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ర్టాల‌లో మార్చి 3న విడుద‌ల చేస్తున్నారు. 



ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌ని తాళ్లూరి మాట్లాడుతూ -``తెలుగు అనువాదం నాణ్యంగా చేశాం. సాహితి చ‌క్క‌ని మాట‌లు-పాట‌లు అందించారు. సినిమా చూస్తున్నంత సేపూ తెలుగు స్ట్రెయిట్ సినిమా చూస్తున్న‌ట్టే ఉంటుంది. గౌత‌మ్‌మీన‌న్‌, అలాగే ఏ.ఆర్‌.మురుగ‌దాస్ అంత‌టి ప్ర‌ముఖులు మా సినిమాని ప్ర‌శంసించ‌డం ఆనందాన్నిచ్చింది. మార్చి 3న  సినిమా రిలీజ్ చేస్తున్నాం`` అని  అన్నారు. 


స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -``చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్ ప్ర‌శంస త‌ర్వాత ట్రైల‌ర్ చూసి ఏ.ఆర్.మురుగ‌దాస్ అభినందించ‌డం మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది.  మురుగ‌దాస్ నిర్మించిన `ఎంగేయుమ్ ఎప్పోదుమ్‌` చిత్రాన్ని తెలుగులో `జ‌ర్నీ` పేరుతో అందించి విజ‌యం అందుకున్నాం. ఇప్పుడు ఆయ‌న ప్ర‌శంస పొందిన `మెట్రో` అంత‌కుమించి విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమా ఉంది. తెలుగు ఆడియెన్స్  కు ప్రామిస్సింగ్ సినిమాని అందిస్తున్నాం. మార్చి 3 సినిమా విడుద‌ల చేస్తున్నాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూడ‌దగ్గ సినిమా ఇది` అని  అన్నారు.