ర‌వితేజ పైనే మెహ్రీన్ ఆశ‌ల‌న్నీ


కృష్ణ‌గాడి వీర‌ప్రేమ గాథ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన మెహ్రీన్ కు తొలి సినిమానే స‌క్సెస్ కావ‌డంతో త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు త‌న ఖాతాలో వేసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ భామ‌కు కాస్త ఆల‌స్యంగానే ఛాన్స్ లు రావ‌డం మొద‌లెట్టాయి. ప్ర‌స్తుతం మెహ్రీన్ చేతిలో ఉన్న‌వి రెండే సినిమాలు. అందులో ఒక‌టి జ‌వాన్ కాగా, మ‌రొక‌టి రాజా ది గ్రేట్.

ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాలూ సెట్స్ పైనే ఉన్నాయి. అనిల్ రావిపూడి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న రాజా ది గ్రేట్ షూటింగ్ లో పాల్గొంటుంది మెహ్రీన్ ఇప్పుడు. కొన్ని రోజులుగా డార్జిలింగ్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం గురించి మెహ్రీన్ చెప్తూ, నా కెరీర్ స్టార్టింగ్ లోనే ర‌వితేజ వంటి స్టార్ హీరోతో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డం నిజంగా త‌న అదృష్ట‌మ‌ని చెప్పుకుంటుంది. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌లో త‌న పాత్ర‌కు ఎలాంటి ప్రాముఖ్య‌త ఉంటుందో, ఈ సినిమాలో కూడా ర‌వితేజ పాత్ర‌తో స‌మాన‌మైన ప్రాధాన్య‌త త‌న పాత్ర‌కీ ఉంటుంద‌ని చెప్పింది. కాగా, మెహ్రీన్ ఈ సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే త‌న‌కు వ‌రుస అవ‌కాశాలొస్తాయ‌నే ధీమాతో ఉంది మెహ్రీన్.