రాకింగ్ స్టార్ మనోజ్ గుంటూరోడు కి వాయిస్ ఓవర్ అందించిన ‘’మెగాస్టార్ చిరంజీవి’’


క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్  పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా S.K. సత్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం గుంటూరోడు..  మార్చి 3 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ అందించడం జరిగింది . రాకింగ్ స్టార్ మనోజ్ మూవీ గుంటూరోడు చిత్రంలో కథ, పాత్రల పరిచయ సన్నివేశాలకు మెగాస్టార్ చిరంజీవి గారు తన మాస్ స్టైల్ లో వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది అని చిత్ర దర్శకుడు sk. సత్య తెలియచేసారు.అనంతరం హీరో మంచు మనోజ్ బాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఆనందంగా వుందని ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మా టీం అందరి తరుపన స్పెషల్ థాంక్స్ తెలియచేస్తున్నామని తెలిపారు.. 

మంచు మనోజ్ సరసన కథానాయకిగా ప్రగ్యా జైస్వాల్ (కంచే ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్,  పృథ్వి  ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్  తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం .. సంగీతం: శ్రీ వసంత్,  సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి, 

ఎడిటర్:  కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్,  ఫైట్స్ : వెంకట్ , కొరియోగ్రాఫర్ : శేఖర్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి , భాస్కరభట్ల, శ్రీ వసంత్,   కో– డైరెక్టర్ T. అర్జున్,  

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్:  బుజ్జి,  సురేష్ రెడ్డి, పోస్ట్ ప్రొడక్షన్ సూపర్ వైజర్ జి.వి.రావు   

ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: ప్రభు తేజ, 

నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి, 

కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య