మిస్ట‌ర్ కోరిక‌ను తీర్చ‌నున్న చిరూ


బ్రూస్ లీ త‌ర్వాత శ్రీను వైట్ల చాలా గ్యాప్ తీసుకుని మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో చేస్తున్న చిత్రం మిస్ట‌ర్.  ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుద‌ల‌కు స‌న్నాహాలు జ‌రుపుకుంటుంది. వ‌రుణ్ తేజ్ కూడా త‌న సినిమా ఆడియోను ఒక్కొక్క పాట‌గా విడుద‌ల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ను ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈనెల 30వ తేదీన మిస్ట‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తుంది యూనిట్. అయితే ఆ ఈవెంట్ కు మెగాస్టార్ ను ఎలాగైనా తీసుకురావాల‌న్న యోచ‌న‌లో ఉన్న‌డు వ‌రుణ్.

మిస్ట‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మీరు త‌ప్పకుండా రావాల్సిందేనంటూ వెళ్లి చిరు ముందు కూర్చున్నాడ‌ట ఈ మెగా ప్రిన్స్. ఇందుకు మెగాస్టార్ నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డం విశేషం. శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ కు ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలో వ‌రుణ్ కు జోడీగా లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా పటేలు జోడీ క‌ట్టారు. ఈ సినిమాపై అటు వ‌రుణ్, ఇటు శ్రీను వైట్ల ఇద్ద‌రూ బాగా అంచ‌నాలు పెట్టుకున్నారు. వీరి అంచనాలు మిస్ట‌ర్ అందుకుంటాడో లేదో తెలియాలంటే ఏప్రిల్ 14 వ‌ర‌కు ఆగాల్సిందే.