మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం టైటిల్ 'సైరా నరసింహారెడ్డి'


మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిరంజీవి 151 వ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. కొణిదెల సురేఖ సమర్పణలో, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ' సైరా నరసింహారెడ్డి ' అని టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసి, ఈ సినిమా కోసం పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణుల జాబితా విడుదల చేసారు.


ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటించబోతుంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి మరియు సుదీప్ కిచ్చ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.