MEGA HEROES WITH KRISHNA GADI LOVER MEHARIN


MEHARIN...Debut heroine of recent hit film "Krishna Gadi Veera Prema Gadha" . With her debutant film ,heroine 'meharin' got good compliments from audience as well as critics . Her acting was very much impressive in her first film . After 'Krishna gadi..' movie 'meharin' got plenty offers at her door step,but she is accepting them very attentively than signing every offer. Meharin signed two new films with Mega Heroes..!! She is pairing up with Hero " Sai Dharam Tej " & "Allu Sirish ".. Allu sirish is busy with "Sree Rasthu - Subhamasthu " movie. Under 'M.N.Reddy' Direction 'Allu Sirish' signed a new project.For this film 'Meharin' is playing lead heroine role. Recently this movie started with traditional pooja ceremony & shooting will be started soon. Allu Sirish took break after facing flops with his previous two films & breathlessly waiting for a success turn at box office.

కృష్ణ‌గాడి ప్రేమికురాలితో మెగాహీరోల రొమాన్స్
  తొలిచిత్రంతోనే త‌న ప్ర‌తిభ‌ను  క‌న‌బ‌రచి అంద‌రి దృష్టిని త‌న వైపు తిప్పుకుంది ఈ భామ‌. త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.  అమ్మ‌డు అడుగు పెట్టిన వేళా విశేషం బాగుండ‌టంతో ఆఫ‌ర్లు వ‌రుస‌న వ‌స్తున్నాయి. ఏకంగా ఇద్ద‌రు  మెగా హీరోలతో న‌టించ ఛాన్స్ కొట్టేసింది. కృష్ణగాడి వీర ప్రేమగాథ తో టాలీవుడ్‌కి పరిచయమైన మెహరీన్.. తన తొలిచిత్రంతోనే మంచి నటన కనబరిచి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. దాంతో.. ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే.. కెరీర్ పరంగా ఓ స్థాయికి ఎదగాలనుకున్న మెహరీన్.. సినిమా సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రతి ఆఫర్‌ని ఒప్పుకోకుండా నటనకు ప్రాధాన్యమున్న సినిమాలనే ఓకే చేస్తుంది. ఇప్పటికే సాయిధరమ్ తేజ్‌ సరసన నటించే అవకాశాన్ని ఈ అమ్మడు చేజిక్కించుకోగా.. తాజాగా మరో మెగా హీరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంవీఎన్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ కథానాయకుడిగా రూపొందుతున్న  ప్రేమ‌క‌థ‌లో హీరోయిన్ కోసం చాలామంది హీరోయిన్స్ ని పరిశీలించిన అనంతరం చివరికి కృష్ణ‌గాడి ప్రేమికురాల‌ని సెలెక్ట్ చేసేశారు. రీసెంట్‌గానే ఈ మూవీ ముహూర్త కార్యక్రమాలు జరిగిపోయాయి. మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.చిత్రానికి సంబంధించిన మిగ‌తా విశేషాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డికానున్నాయి. ఇదిలా ఉండ‌గా.. గౌర‌వం, కొత్త‌జంట‌ సినిమాలతో నిరాశపరిచిన శిరీష్.. కొంత గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత శిరీష్-మెహరీన్ కాంబినేషన్లో రానున్న సినిమా పట్టాలెక్కుతుంది.