భావనని రేప్ కూడా చేశారు అని చెప్తున్నారు !


మీడియా అంటే కాస్త హుందాగా వ్యవహరించాలి. ఒక విషయాన్ని గురించి చెప్పే సమయంలో అందులో మంచి చెడులను , నిజ నిజాలను ఒకటికి వంద సార్లు నిర్దారించుకోవాలి . అయితే అలాంటి మీడియానే హీరోయిన్ భావన విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది.భావనని కొంత మంది వ్యక్తులు  లైంగికంగా వేధించారు అన్న వార్త రాగానే అక్కడి మలయాళ మీడియా అత్యుత్సాహం చూపించేసింది. లైంగిక వేధింపులకు గురి  అయిన భావనని ఏకంగా గంట సేపు రేప్ చేశారు అని అక్కడి మీడియా కథనాలను ప్రచారం చేసింది . దీనితో ఇప్పుడు మలయాళ మీడియా పై అక్కడి సినీ పరిశ్రమ పెద్దలు కోపంగా ఉన్నారు . 


నిజానికి షూటింగ్ ను ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా.. తనను కిడ్నాప్ చేసి.. కారులో తిప్పుతూ గంటకు పైనే లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా భావన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎక్కడా కూడా తనను అత్యాచారం చేసినట్లుగా ఆమె పేర్కొనలేదు.కానీ.. ఇందుకు భిన్నంగా భావనను రేప్ చేసినట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయటంపై జరుగుతున్న ప్రచారాన్ని మలయాళ సినీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.వేధింపులు జరిగినట్లుగా చెబితే.. రేప్ అంటూ ప్రచారం చేయటం దారుణమంటున్నారు. భావనకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని.. ఈ ఘటనతో ఆ పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగదంటున్నారు.