సెన్సార్ పూర్తి చేసుకున్న మన్యం పులి


తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ‘యు’ రేటింగ్ తో ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకి రాబోతుందని నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా మళయాలీ వెర్షన్ ‘పులిమురుగన్’ భారీ స్థాయిలో విడుదలై దాదాపు 125 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూళు చేసింది. అదే రేంజ్ లో తెలుగునాట కూడా ఈ సినిమా భారీ సక్సెస్ అవుతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది, కేవలం 24 గంటల్లో 5 లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయని చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే చిత్ర థియేట్రికల్ ట్రైలర్ తో పాటు ప్రి రిలీజ్ ఫంక్షన్ నిర్వహించేందుకు మన్యం పులి యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈసినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా మన్యం పులి కోసం ఎదురుచూస్తున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్, బ్యానర్ : సరస్వతి ఫిల్మ్స్ https://www.youtube.com/watch?v=jDJkx7TOeYA