గుంటూరెళ్లి ప్రేమ‌లో ప‌డిన హీరో


 క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్  పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా.. S.K. సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుంటూరోడు. ఈ సినిమా మొత్తం గుంటూరు నేప‌థ్యంలోనే జ‌రుగుతుంది కాబ‌ట్టే సినిమాకు ఆ టైటిల్ ను పెట్ట‌డం జ‌రిగింది. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది. 
 
ఈ సంద‌ర్భంగా డైర‌క్ట‌ర్ మాట్లాడుతూ, ఇది పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అని, అందరిని అలరించే విధంగా సినిమా ఉంటుందని తెలియజేసారు. ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ, ఇప్ప‌టికే సినిమా టాకీ పార్టు పూర్తి అయింది. మిగ‌తా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం అన్నారు. 
 
మంచు మనోజ్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో మ‌నోజ్ సరసన కథానాయకిగా ప్రగ్యా జైస్వాల్ (కంచే ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోటశ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, 
కాశీ విశ్వనాథ్  తదితరులు నటిస్తున్నారు.
 
సాంకేతిక వర్గం .. 
సంగీతం:  DJ శ్రీ వసంత్,  సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి, 
ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్,  ఫైట్స్ : వెంకట్ , కో– డైరెక్టర్ T. అర్జున్,  
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్:  బుజ్జి,  సురేష్ రెడ్డి ,
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: ప్రభు తేజ, 
నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి, 
కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య