Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

గుంటూరోడు గా వ‌స్తున్న మంచు మ‌నోజ్..


క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్  పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా.. S.K. సత్య దర్శకత్వంలో రూపొందుతున్న  నూతన చిత్రానికి గుంటూరోడు అని టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రం గుంటూరు నేపధ్యంలో జరిగే కథాంశం అవ్వడం వలన ఈ టైటిల్ పెట్టటం జరిగింది. ఇది పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అని అందరిని అలరించే విధంగా వుంటుందని డైరెక్టర్ తెలియజేసారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు తెలియజేసారు.
మంచు మనోజ్ సరసన కథానాయకిగా ప్రగ్యా జైస్వాల్ (కంచే ఫేమ్) నటించనుండగా
ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోటశ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్,
కాశీ విశ్వనాథ్  తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం .. సంగీతం:  DJ శ్రీ వసంత్,  సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి,
ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్,  ఫైట్స్ : వెంకట్ , కో– డైరెక్టర్ T. అర్జున్, 
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్:  బుజ్జి,  సురేష్ రెడ్డి ,
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: ప్రభు తేజ,
నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి,
కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య