`16` ట్రైల‌ర్‌కు రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ అభినంద‌న‌...


తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డం చిత్రాల్లోవిభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌దైన గుర్తింపు పొందిన విల‌క్ష‌ణ న‌టుడు ర‌హ‌మాన్. రీసెంట్‌గా త‌మిళంలో సూప‌ర్‌హిట్ మూవీ `ధృవంగ‌ళ్ ప‌దినారు` సినిమాతో మ‌రో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు రెహ‌మాన్‌. ఈ చిత్రాన్నిశ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై తెలుగులో `16` అనే పేరుతో చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు. తెలుగులో ఇటీవ‌ల విడుద‌ల 16 సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌స్తుంది. సినీ ప్ర‌ముఖులంద‌ర‌రూ ఈ సినిమా ట్రైల‌ర్ బావుంద‌ని అప్రిసియేట్ చేస్తున్నారు. `16 ట్రైల‌ర్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది..ర‌హ‌మాన్‌గారు ఈ చిత్రం హిట్‌తో మ‌ళ్ళీ ఇండ‌స్ట్రీకి బ్యాక్ అయ్యారు` అంటూ రాకింగ్ స్టార్ మంచు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో సినిమాను అభినందించారు.  కార్తీక న‌రేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో మార్చ్  9న విడుదలవుతుంది