Mahesh Babu With 14 Reels


Dookudu is a special movie in Mahesh babu career said by himself many times.Not only movie producers of those movie are also liked by Mahesh.The passion, planning, promotion of those producers are liked by Mahesh.Recently he praised them on to the cloud9 at the audio function of Krishna gadi veera prema gadha.

After Dookudu,1 Nenokkadine and Aagadu Mahesh again going to work with this producers.He want to save them from the disasters he gave or its a deal we don't know but next year this combination is confirmed. Story,director etc all are not cleared but Mahesh committed. Already mahesh committed with Ashwin dart and Bramotsavam producers let's wait and see with whom he will work first.

 
14రీల్స్ తో మ‌హేష్ సినిమా
దూకుడు త‌న కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ అని చాలాసార్లు చెప్పుకున్న మ‌హేష్ కి ఆ సినిమా అంటేనే కాదు, ఆ ప్రొడ్యూస‌ర్స్ అంటే కూడా చాలా అభిమానం. 14రీల్స్ ప్రొడ్యూస‌ర్స్ కు నిర్మాణ విష‌యంలో ఉన్న‌ వాళ్ల ప్యాష‌న్, ప్లానింగ్, ప్ర‌మోష‌న్స్ అన్నీ విప‌రీతంగా నచ్చేసిన మ‌హేష్, ఈ మ‌ధ్య వాళ్లు నిర్మించిన సినిమా కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాధ ఆడియో వేడుకలో వాళ్ల గురించి చెప్పి, వాళ్ల‌ను ఆకాశానికెత్తేశాడు.
దూకుడు త‌ర్వాత 1నేనొక్క‌డినే, ఆగ‌డు వంటి డిజాస్ట‌ర్స్ తీసిన ఈ నిర్మాణ‌సంస్థ‌లో మ‌హేష్ మ‌రోసారి న‌టించ‌నున్నాడు. త‌న వ‌ల్ల దెబ్బతిన్న సంస్థ‌ను ఆదుకోవాల‌నుకున్నాడో లేక ఏదో డీల్ అలా కుదిరిందో తెలీదు కానీ, వ‌చ్చే ఏడాది ఈ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ట‌. స్టోరీ, డైర‌క్ట‌ర్ మిగ‌తా వివ‌రాలేమీ ఇంకా క‌న్ఫార్మ్ కాకుండానే మ‌హేష్ క‌మిట్ అయ్యాడ‌ట‌. ఆల్రెడీ బ్ర‌హ్మోత్స‌వం ప్రొడ్యూస‌ర్ కి, అశ్వ‌నీద‌త్ కు క‌మిట్ మెంట్స్ ఇచ్చిన మ‌హేష్ ముందు ఎవ‌రితో సినిమా చేస్తాడో చూడాలి.