బిజినెస్ మ్యాన్ గా మ‌హేష్ బాబు


మ‌హేష్ బాబు టాలీవుడ్ సూప‌ర్ స్టార్. ఒక‌ప్పుడు ఎవ‌రినైనా క‌ల‌వాలంటేనే ఇబ్బందిగా, షై ఫీల‌య్యే మహేష్, త‌న సినిమా ఫంక్ష‌న్స్ కు కూడా తాను వెళ్లేవాడు కాదు. కానీ ఎప్పుడైతే న‌మ్ర‌త త‌న జీవితంలోకి వ‌చ్చిందో, అప్పటి నుంచి మ‌హేష్ లైఫే మారిపోయింది. కేవ‌లం ఆడియో లాంఛ్స్ కి   వెళ్లి ఊరుకోకుండా, సినిమాను ద‌గ్గరుండి మ‌రీ ప్ర‌మోష‌న్స్ ద్వారా త‌న సినిమాల‌ను మ‌రో స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఇటు సినిమాలు  చేస్తూనే, మ‌రోవైపున బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హరిస్తున్నాడు మ‌హేష్. సినిమాల‌తో పాటే, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల‌నూ ఒప్పుకుని, ఆదాయం సంపాదించడం మొద‌లుపెట్టిన సూప‌ర్ స్టార్ బ్రాండ్ అంబాసిడ‌ర్స్ విష‌యంలో చాలా మంది టాలీవుడ్ హీరోల‌కు ఆద‌ర్శంగా నిలిచాడు. అయితే ఇప్పుడు మ‌హేష్ బాబు గురించి మ‌రొక ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌టికొచ్చింది. అదే మ‌న సూప‌ర్ స్టార్ బిజినెస్ మ్యాన్ గా మార‌బోతున్నాడట‌.

ఏషియ‌న్ ఫిలిమ్స్ అధినేత‌తో క‌లిసి మ‌హేస్ మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ ను ప్రారంభించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వీళ్లిద్ద‌రి సార‌ధ్యంలో రెండూ తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి 25 మ‌ల్టీప్లెక్స్‌లను నిర్మించ‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఉన్న సింగిల్ స్క్రీన్స్ ను తీసుకుని, వాటిని మ‌ల్టీప్లెక్స్ లుగా మార్చి, వాటిని రీ మోడ‌ల్ చేయ‌నున్నార‌ట‌. అంటే జ‌స్ట్ ఈ బిజినెస్ గా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తే, మిగతా ప‌నులన్నీ న‌మ్ర‌త చ‌క్క‌పెట్టుకుంటుద‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ అనేది లాభ‌దాయ‌కంగా మారడంతో, మహేష్ ఈ బిజినెస్ లోకి అడుగు పెడుతున్న‌ట్లు చెప్పుకుంటున్నారు.