మహేష్ బాబు డూప్ లేకుండానే ఆ ఫైట్స్ చేసాడు


మహేష్ బాబు కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు చాల ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రొడక్షన్ డిజైనర్ 'రుపిన్ సుచక్' ప్రస్తావించారు. ఈ సినిమాలో కొన్ని రిస్కీ ఫైట్స్ ఉన్నాయనీ .. వాటిని చేయడానికి డూప్స్ కూడా ఆలోచించారని చెప్పాడు.


కానీ, మహేష్ బాబు దానికోసం డూప్స్ అవసరం లేదని చెప్పి ఆ ఫైట్స్ చేశాడనీ .. హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడని అన్నాడు. మహేష్ బాబు అంత రిస్క్ తీసుకుంటాడని తాను ఊహించ లేదనీ, ఆయన ధైర్యాన్ని మెచ్చుకోకుండా వుండలేకపోయానని చెప్పాడు. మహేష్ చేసిన రియల్ ఫైట్స్ ఆయన ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయని అన్నాడు. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, జూన్ 23న విడుదల చేయనున్నారు.