ర‌కుల్ పాత్ర‌ను ఫైన‌ల్ చేసిన మ‌హేష్ బాబు


ర‌కుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో సినిమా చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో క‌లలు కన్న‌ది. ఒకానొక స‌మయంలో పెళ్లెప్పుడు చేసుకుంటావు ర‌కుల్ అని అడిగితే, దాదాపు అంద‌రి హీరోల‌తో చేశా, మ‌హేష్ బాబు తో కూడా సినిమా చేశాక అప్పుడు ఆలోచిద్దాం అని ర‌కుల్ అన్న‌ది అంటే, ర‌కుల్ మ‌హేష్ తో సినిమా చేయాలిని ఎంత‌గా క‌ల‌లు క‌న్న‌దో అర్థ‌మ‌వుతుంది. అప్ప‌ట్లో బ్ర‌హ్మోత్సవం సినిమా కు ఆఫ‌ర్ వ‌చ్చినా, డేట్లు స‌ర్దుబాటు కాక‌, ఆ అవ‌కాశాన్ని వ‌దిలేసుకుంది ర‌కుల్. అయితే ఆ ఛాన్స్ ర‌కుల్ మిస్ అవ్వ‌డ‌మే మంచిది అయిందిలే. లేదంటే ర‌కుల్ కెరీర్ మీద కూడా బ్ర‌హ్మోత్స‌వం ఎఫెక్ట్ ప‌డి ఉండేది. ఇప్పుడు మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మహేష్ న‌టిస్తున్న స్పైడ‌ర్ మూవీలో ఆమెకు ఛాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలో మ‌హేష్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ  పాత్ర స్పై గానూ పని చేస్తుంద‌ని, అందుకే టైటిల్ కూడా స్పైడ‌ర్ అని పెట్టార‌ని చెప్ప‌క‌నే చెప్పింది మూవీ టీమ్.

ఈ నేప‌థ్యంలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టిస్తున్న ర‌కుల్ ఏ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది అన్న అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. రీసెంట్ గా ఓ త‌మిళ మ్యాగ‌జైన్ కు ఇచ్చిన ఇంట‌ర్వూలో ర‌కుల్ క్యారెక్టర్ గురించి మ‌హేష్ నోరు విప్పాడు. ఈ సినిమాలో ర‌కుల్ ఒక మెడిక‌ల్ కాలేజ్ స్టూడెంట్ గా క‌నిపించ‌నుందని, ఆమె క్యారెక్ట‌ర్ కు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉందని చెప్పాడు మ‌హేష్. ప్ర‌స్తుతం ఈ సినిమాలోని మ‌హేష్ -ర‌కుల్ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.