మ‌హేష్ ఇప్పుడైనా ఫోక‌స్ చేస్తాడా..?


 మ‌హేష్ న‌టించిన 'బ్ర‌హ్మోత్స‌వం' వ‌చ్చి 8 నెల‌లు దాటినా, త‌ను త‌ర్వాత మురుగ‌దాస్ తో చేస్తున్న సినిమా కు సంబంధించిన షూటింగ్ దాదాపు స‌గానికి పైగా అయిపోయినా, ఇప్ప‌టివ‌ర‌కు త‌న లుక్ ను మాత్రం మ‌హేష్ చూపించ‌లేదు. అంతేకాదు జూన్ 23 న సినిమా రిలీజ్ చేస్తున్నామ‌ని చెప్పిన డైర‌క్ట‌ర్ క‌నీసం ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్, ట్రైల‌ర్ ల గురించి ఒక్క‌మాట కూడా మాట్లాడలేదు. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ అభిమానులు తమ అభిమాని లుక్ ఈ సినిమా లో ఎలా ఉండ‌బోతుందా అని తెగ ఎదురుచూస్తున్నారు. 


మ‌రోవైపు ఈ సినిమాకు టైటిల్ కూడా ఇప్ప‌టివ‌ర‌కు బ‌య‌ట‌కురాలేదు. ఏజెంట్ శివ‌, సంభ‌వామి యుగే యుగే, మ‌ర్మం, అభిమన్యు ఇలా చాలా టైటిల్స్ ను ప‌రిశీలించారు కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఏ టైటిల్ ను క‌న్ఫార్మ్ చేయ‌లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు రెండు భాష‌ల్లో ఒకే టైటిల్ ను పెట్టాల‌ని భావిస్తున్నాడ‌ట మురుగదాస్. ఫ‌స్ట్ లుక్ సంగ‌తి ప‌క్క‌న పెడితే, క‌నీసం టైటిల్ మీద‌నైనా ఫోక‌స్ చేస్తే బాగుండు.