Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Lavanya Tripathi Photoshoot For DSP


దేవిశ్రీ గుట్టును ర‌ట్టు చేసిన అందాల రాక్ష‌సి
డీ.. ఎస్.. పీ.. అంటే సినీప్ర‌పంచానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అత‌నంటేనే ఒక ఎన‌ర్జీ. ఒక ప‌వ‌ర్. త‌న ప్రొఫెష‌న్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అయినా, స్టేజ్ ఎక్కాడంటే త‌న ప‌ర్ఫామెన్స్ తో అంద‌రి మ‌తి పోగొట్టేస్తాడు. త‌ను కేవ‌లం సింగ‌ర్, డ్యాన్స‌ర్, లిరిసిస్ట్ గానే కాదు. రాక్ స్టార్ లో ఫోటోగ్ర‌ఫీ అనే క‌ళ కూడా ఉంది. ఏంటీ న‌మ్మ‌ట్లేదా.. ఈ విష‌యాన్ని మ‌న అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి నే ప్రాక్టిక‌ల్ గా చెప్తుంది.
దేవిశ్రీప్ర‌సాద్ కి ఫోటోగ్ర‌ఫి అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఖాళీ దొరికినా కెమెరా ప‌ట్టుకుని అనేక లొకేష‌న్ల‌కు వెళ్లి ఫోటోలు తీసి అప్పుడ‌ప్పుడూ ట్విట్ట‌ర్ లో పెడుతూ ఉంటాడు. అలా తాను తీసిన ఫోటోలు అంద‌రికీ చేరువ అవాలంటే ట్విట్ట‌ర్, ఫేస్ బుక్, ఎగ్జిబిష‌న్ లో కాదు అనుకుని త‌నే ఒక వెబ్ సైట్ పెట్టి, దానిలో ఈ ఫోటో గ్యాల‌రీలు, వివిధ ర‌కాల కెమెరాల గురించిన స‌మాచారం పొందుప‌ర‌చాల‌ని ఆల్రెడీ దేవి ఆలోచ‌న‌లో ఉన్నాడు. ఇంత‌లో లావ‌ణ్య ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టేసింది.
'దేవిశ్రీప్రసాద్ కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చాలా కాలంగా నన్ను ఓ ఫోటో షూట్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాడు. ఒక రోజు చెన్నైలో ఉన్న డీఎస్పీ స్టూడియోకి వెళ్లినపుడు.. నన్ను కొన్ని ఫోటోలు తీశాడు. నేను కూడా హ్యాపీగా బోలెడన్ని పోజులు ఇచ్చాను. తను ఓ అద్భుతమైన ఫోటోగ్రాఫర్. తను తీసిన ఫోటోలను చూస్తే మెస్మరైజ్ అవడం ఖాయం. వాటి గురించి నేను చెప్పనవసర్లేదు అవే మాట్లాడతాయ్ కూడా' అంటోంది లావణ్య త్రిపాఠి. రాక్ స్టార్ తీసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది లావణ్య త్రిపాఠి. ఈ ఫోటోలను చూస్తే.. లావ‌ణ్య చెప్పింది అక్షర సత్యాలని అర్ధమవుతోంది. దేవిశ్రీలో ఉన్న ఎవరికీ తెలియని ఈ ట్యాలెంట్ ను మొత్తానికి లావణ్య బయటపెట్టేసింది. మరి ఈ ట్యాలెంట్ ని ఉపయోగించుకునేదెవరో..
https://www.youtube.com/watch?v=IznbN67jtu0