చంద్ర‌ముఖికి మ‌రో మెగా ఆఫ‌ర్


అందాల రాక్ష‌సి తో తెలుగు తెర‌కు మాంచి సౌంద‌ర్యాన్ని ప‌రిచ‌యం చేసి, యూత్ మ‌న‌సుల‌ను దోచేసిన హీరోయిన్స్ లో లావ‌ణ్య త్రిపాఠి ఒక‌రు. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ ను ఎంచుకుంటూ, వ‌రుస సక్సెస్ ల‌తో దూసుకెళ్తుంది ఈ సుంద‌రి. అందాల రాక్ష‌సి, మ‌నం, భ‌లే భ‌లే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లే అందుకు నిద‌ర్శ‌నం. 

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు తో మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టిన లావ‌ణ్య ఆ సినిమాతో మంచి విజ‌యాన్నే అందుకుంది. రీసెంట్ గా వ‌చ్చిన మిస్ట‌ర్ మూవీ ఆమెకు ఘోర ప‌రాజ‌యాన్ని మిగిల్చింది. కానీ ఈ ఫ్లాప్ లావ‌ణ్య మీద పెద్ద‌గా ప్ర‌భావం ఏమీ చూపించ‌క‌పోవ‌చ్చు. దానికి రీసెంట్ గా ఆమెకు మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన మ‌రో ఆఫ‌రే కార‌ణం. వివి వినాయక్ ద‌ర్శ‌క‌త్వంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ చేస్తున్న సినిమాలో లావ‌ణ్య ను తీసుకున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాలు త్వర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.