Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

లావోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 తొలి షెడ్యూల్ పూర్తి!


 లావోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై  నోయ‌ల్, ఎస్తేర్, శ్రీ ,అర్జున్ మీన‌న్  ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కృష్ణ‌మోహ‌న్, న‌రేన్, శ్రీరామ్ కందుకూరి నిర్మాత‌లు.  క్రాంతి వడ్ల‌మూడి ద‌ర్శ‌కుడు. షెడ్యూల్ చివ‌రి రోజున  చిత్ర సెట్ లో యూనిట్ స‌భ్యులంద‌రూ  పాల్గొన‌గా హీరో శ్రీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ...``ప్ర‌ధాన తారాగ‌ణమంతా పాల్గొన‌గా తొలి షెడ్యూల్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించాము. `స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా సాగే చిత్ర‌మిది. త్వ‌ర‌లో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తామ‌న్నారు. 
laeoనిర్మాత‌లు మాట్లాడుతూ..``న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు పూర్తి స‌హ‌కారం అందించ‌డంతో తొలి షెడ్యూల్ విజ‌యవంతంగా పూర్తి చేశాము. ఈ షెడ్యూల్ చివ‌రి రోజున లొకేష‌న్ లో  హీరోల్లో ఒక‌రైన శ్రీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌ప‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు.
 
హీరో శ్రీ మాట్లాడుతూ...``ద‌ర్శ‌కుడు క్రాంతి నా కోసం ఈ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ రోల్ డిజైన్ చేశారు. ఈ పాత్ర‌లో న‌న్ను చాలా కొత్తగా ఆవిష్క‌రిస్తున్నారు.  ఎప్పుడెప్పుడు న‌న్ను నేను స్ర్కీన్ పై చూసుకుంటానా అన్న ఉత్సాహంతో ఉన్నాను. ఈ సినిమా ప్ర‌తి ఒక్కిరికీ మంచి పేరు తెస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.
 
నోయ‌ల్,  ఎస్తేర్, శ్రీ, అర్జున్ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః చేత‌న్ మ‌ధురాంత‌కం; స‌ంగీతంః గీతా పూనిక్; ఎడిట‌ర్ః త‌మ్మిరాజు,  ఆర్ట్ : రమేష్ బాబు, పిఆర్వోః వంగాల కుమార‌స్వామి (బాక్సాఫీస్‌) ;ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బి.సి.చౌద‌రి;   నిర్మాత‌లుః కృష్ణ మోహ‌న్, న‌రేన్, శ్రీరామ్ కందుకూరి; ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః క్రాంతి వ‌డ్ల‌మూడి.