Latest News

వీ.ఐ.పీ2 కోసం నాకు అబద్దం చెప్పారు: కాజోల్ `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్` పైర‌సీపై సైబ‌ర్ పోలీసుల‌కు పిర్యాదు చేసిన దిల్‌రాజు 28% Gst పై ధ్వ‌జ‌మెత్తిన టీ-ఫిలించాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ అధ్య‌క్ష‌డు ఆర్.కె గౌడ్!! ఈనెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న `క‌దిలే బొమ్మ‌ల క‌థ‌` మహేష్ బాబు సినిమా షూటింగ్ లో ధోని హీరోయిన్ ఈనెల 30న అనుష్క ప్రధాన పాత్రగా వస్తున్న 'భాగమతి' ఫస్ట్ లుక్ విడుదల యాక్షన్ కింగ్ అర్జున్ ‘‘కురుక్షేత్రం’’ మూవీ టీజర్ కు రెస్పాన్స్ అదుర్స్ ఆగష్టులో విడుదల కానున్న రాజు గారి గది2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 1న సాయి ధరమ్ తేజ్ జవాన్ విడుద‌ల త‌మ్ముడు చ‌నిపోయినా, షూటింగ్ కు వెళ్లాడు..

Lakshmi the snow hill


మేము సైతం తో ఆదరగోడుతున్న మంచు లక్ష్మి   మంచు ల‌క్ష్మి.. మోహ‌న్ బాబు గారాల‌ప‌ట్టి. విష్ణు, మ‌నోజ్ ల ప్రియ‌మైన అక్క‌. ఇంటి పేరు లాగే త‌న మ‌న‌సు కూడా ఎంతో చ‌ల్ల‌నైన‌ది. న‌టిగానూ, నిర్మాత‌గానూ, టెలివిజ‌న్ హోస్ట్ గానూ.. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి వ‌చ్చిన మంచు ముత్యం ల‌క్ష్మి.  సినిమా రంగం లోనే కాకుండా, బుల్లితెర రంగంలో కూడా సత్తా చాటుతోంది. సినిమాలు తీయడం.. నటించడమే కాకుండా టీవీల్లో టాక్ షోలతోనూ తనదై పేరు సంపాదించుకుని తండ్రికి త‌గ్గ త‌న‌య అనిపించుకుంది.ల‌క్ష్మి టాక్ షో తో స్టార్ట్ చేసి, ప్రేమతో మీ లక్ష్మి, లక్కుంటే లక్ష్మి, దూసుకెళ్తా, బూమ్ బూమ్ వంటి షో లను దిగ్విజయంగా కొనసాగించింది. సామాజిక సేవ లో కూడా త‌న‌వంతు సాయం అందిచడంలో ఎప్పుడూ ముందుంటుంది. చెన్నై వరదల సమయం లో మేము సైతం అంటూ ఓ కాంపెయిన్ ను టాలీవుడ్ తరపున నడపడంలో లక్ష్మీ మంచు కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా చాలా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్న అనుభవం ఆమె సొంతం. ప్ర‌స్తుతం ఓ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛానెల్ లో ప్ర‌సార‌మ‌వుతున్న మేము సైతం అనే కార్య‌క్ర‌మం ద్వారా సామాజిక సేవ చేస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతుంది.