ఔత్సాహికులైన గాయ‌నీగాయ‌కుల‌కు ల‌హ‌రి మ్యూజిక్ ఆహ్వానం..!


ఔత్సాహికులైన గాయ‌నీగాయ‌కుల‌కు ల‌హ‌రి మ్యూజిక్ సంస్థ రెండు అరుదైన అవ‌కాశాలు క‌ల్పిస్తుంది. 1) ల‌హ‌రి యూట్యూబ్ ఛాన‌ల్ లో క‌నిపించాల‌నుకుంటే...ఎవ‌రైనా ఆస‌క్తి గ‌ల సింగ‌ర్స్ త‌మ పాట‌ను వీడియో రూపంలో పంపిస్తే అలా వ‌చ్చిన వాటిలో బెస్ట్ సాంగ్ ను సెలెక్ట్ చేసి ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన పాట‌ల‌ను ల‌హ‌రి మ్యూజిక్ ఛాన‌ల్ తో పాటు ఎఫ్.ఎం లో కూడా ప్ర‌సారం చేస్తారు. 2) పాట‌ను వీడియో రూపంలో చిత్రీక‌రించేందుకు ఎవ‌రైనా ప్రొడ్యూస‌ర్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించే వారి కోసం ప్రొడ్యూస్ చేయ‌డానికి కూడా ల‌హ‌రి మ్యూజిక్ రెడీగా ఉంది. రికార్డ్ ట్రాక్ ను పంపిస్తే...వాటిలో ఉత్త‌మ‌మైన ఆడియోను సెలెక్ట్ చేసి అవ‌కాశం క‌ల్పిస్తారు. అయితే...సింగ‌ర్స్ ల‌హ‌రి మ్యూజిక్ ఆల్బ‌మ్ లో పాట‌ను మాత్ర‌మే సెలెక్ట్ చేసుకోవాలి. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం...ఔత్సాహికులైన గాయ‌నీగాయ‌కులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోండి..! మీ ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి తెలియ‌చేయండి..!