Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

KRR Class Room


He is a director who showed colourful rainbow on silver screen. A normal heroine becomes start heroine after working in his direction. He added glamour to the commercial movies, he is director K Ragavendra Rao B.A. This 100 films director became now became a teacher. Without any relevance with Film school he is making his 50 years experience as classes. To listen his classes up coming directors need not to join in any course as need not to pay any fee just open his YouTube channel. That is the route to become a director. In June 10th 4 PM the 1st class will be uploaded in this channel. like this every 10 days a class will be uploaded in his channel.
కెఆర్‌ఆర్‌ క్లాస్‌ రూమ్‌
ఆయన.. వెండితెరకు రంగుల హరివిల్లును చూపించిన దర్శకుడు. సాధారణమైన హీరోయిన్‌కి కూడా స్టార్‌ డమ్‌ తీసుకొచ్చిన డైరెక్టర్‌. కమర్షియల్‌ సినిమాకు గ్లామర్‌ని అద్దిన దర్శకేంద్రుడు.. ఆయనే కె.రాఘవేంద్రరావు బి.ఎ. శతాధిక చిత్రాల దర్శకుడైన రాఘవేంద్రరావు ఇప్పుడు అధ్యాపకుడిగా కొత్త బాధ్యతను చేపట్టారు. ఫిల్మ్‌ స్కూల్‌ సిలబస్‌తో సంబంధం లేకుండా తన 50 ఏళ్ళ సినీ అనుభవాల్ని పాఠాలుగా మారుస్తున్నారు. పాటల్ని చిత్రీకరించడంలో తానేంటో నిరూపించిన దర్శకేంద్రుడు నేడు పాఠాలు బోధించడంలో కూడా కొత్త పంథాను ఎన్నుకున్నారు. ఒక అనుభవశాలి అయిన దర్శకుడు ప్రాక్టికాలిటీ ఇన్‌ ఫిల్మ్‌ డైరెక్షన్‌ ప్రధానాంశంగా చేసుకొని పాఠాలు బోధించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావొచ్చు. ఈ పాఠాలు విని దర్శకులు కాబోయేవారు, దర్శకత్వం పట్ల మక్కువ వున్నవారు ఏ క్లాస్‌ రూమ్‌కీ వెళ్ళక్కర్లేదు. ఫీజు కట్టక్కర్లేదు. యూ ట్యూబ్‌లోని కెఆర్‌ఆర్‌ క్లాస్‌ రూమ్‌కి వెళ్తే చాలు. ఆ ఛానల్‌ దర్శకత్వానికి దారి చూపిస్తుంది. ఫిల్మ్‌ మేకింగ్‌లో మెళకువలు నేర్పిస్తుంది. జూన్‌ 10వ తేదీన 4 గంటలకు ఈ ఛానల్‌లో మొదటి పాఠం దర్శనమిస్తుంది. తర్వాత 10 రోజులకో పాఠం ప్రేక్షకుల్ని పలకరిస్తుంది.