ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కృష్ణంరాజు ప్రచారం


 ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారం తుది ఘట్టంలో పాల్గొనవలసిందిగా బిజెపి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ప్రముఖ చలన చిత్ర నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు ఈరోజు (శనివారం) వారణాసి చేరుకున్నారు. ప్రధాని నరంద్ర మోడీ ఎన్నికైన వారణాసి నియోజక వర్గంలోని అయిదు అసెంబ్లీ సిగ్మెంట్లలో ఈరోజు(ఆదివారం) కృష్ణం రాజు ప్రచారం నిర్వహించనున్నారు. దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ  ఇత్యాది ప్రాంతాల వారందరినీ అక్కడ పంచ ద్రవిడులుగా పిలుస్తారు.. ఇలా దక్షిణాదివారు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ప్రచారం నిమిత్తం బిజెపి అధిష్టానం కృష్ణం రాజును ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఆయన సకుటుంబ సమేతంగా వెళ్లి ప్రచారం నిర్వహించడం విశేషం.ఎన్నికల ప్రచారానికి మార్చి 8న తెరపడనున్న నేపధ్యంలో ఆయన ప్రచారానికి మంచి స్పందన లభిస్తుందని బిజెపి వర్గాలు ఆశిస్తున్నాయి.