వ‌రుణ్ తేజ్ త‌ర్వాతే రామ్ చ‌ర‌ణ్‌


గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, ఈ సినిమాతో క్రిష్ త‌న టాలెంట్ ను మ‌రోసారి చూపించి, స్టార్ డైర‌క్ట‌ర్ గా మారిపోయాడు. ఎప్పుడైతే శాత‌క‌ర్ణి విజ‌యం సాధించిందో అప్ప‌టినుంచి క్రిష్ తో ప‌ని చేయ‌డానికి హీరోలంద‌రూ ఆస‌క్తి చూపిస్తున్నారు. క్రిష్ త‌దుప‌రి సినిమా వెంక‌టేష్ తో చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ లోనే ఉన్నాడు క్రిష్. వెంక‌టేష్ తో సినిమా అనంత‌రం రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తో సినిమాలు చేసే అవ‌కాశం ఉందని స‌మాచారం.

varun Cherry

అయితే, గ‌తంలో క్రిష్, వ‌రుణ్ తేజ్ తో 'రాయ‌భారి' అనే స్పై థ్రిల్ల‌ర్ ను చేయాల‌నుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ కు భారీ బ‌డ్జెట్ అవ‌స‌రం అవ‌డంతో, సినిమా ప‌ట్టాలెక్క‌కుండానే ఆగిపోయింది. వ‌రుణ్ తేజ్ తో అంత భారీ ప్రాజెక్ట్ అంటే క‌ష్టం కాబట్టి, ఆ ప్రాజెక్ట్ ను అప్పట్లో తాత్కాలికంగా ఆపేశాడు క్రిష్. అయ‌తే ఇప్పుడు అదే క‌థ‌ను, రామ్ చ‌ర‌ణ్ తో ప్లాన్ చేయాల‌ని చూస్తున్నాడు క్రిష్‌. ఎలాగో రామ్ చ‌ర‌ణ్ తో బ‌డ్జెట్ ప్రాబ్ల‌మ్ ఉండ‌దు కాబ‌ట్టి, ఆ క‌థ‌ను తెర‌కెక్కించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట క్రిష్. రామ్ చ‌ర‌ణ్ కూడా క్రిష్ డైర‌క్ష‌న్ లో ప‌ని చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతుండ‌టంతో, క్రిష్ ప్లాన్ ఫ‌లించే ఛాన్స్ ఉంది. రామ్ చ‌ర‌ణ్- సుకుమార్ ల సినిమా అయిపోయాక, క్రిష్-చెర్రీల కాంబినేష‌న్ తెర‌మీద‌కు వెళ్లే అవ‌కాశ‌ముంది.

https://www.youtube.com/watch?v=CVY3nEtmpTs