పూరి జగన్నాథ్ చేతుల మీదుగా కొబ్బరిమట్ట మొదటి పాట విడుదల.


 'హృదయ కాలేయం' చిత్రం విడుదలకు ముందే సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూని సోషల్ మీడియా హీరో చేసింది. సోషల్ మీడియా అందించిన ఊపుతో విడుదలైన 'హృదయ కాలేయం' చిత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. హృదయ కాలేయం చిత్ర అందించిన విజయంతో నిర్మాత సాయి రాజేష్ కొబ్బరి మట్ట చిత్రాన్ని ప్రారంభించారు. 

 ఇటీవలే విడుదలైన కొబ్బరి మట్ట చిత్ర ఫస్ట్ లుక్ మరియు ఈ సినిమాకి సంభందించిన అన్ని రకాల అప్ డేట్స్ కు మంచి స్పందనే వస్తుంది. అయితే కొబ్బరి మట్ట చిత్రాన్ని క్రేజీ ప్రాజెక్ట్ గా మలిచేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు నటించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో పాపారాయుడు, పెదరాయుడు, అండ్రాయుడు అనే మూడు విభిన్న పాత్రలను సంపూ పోషిస్తున్నారు. అదే ఊపులో ఈరోజు సాయంత్రం ౫ గంటలకు ఈ చిత్రం యొక్క మొదటి పాట ట్రైలర్ ని ప్రముఖ డైరెక్టర్ చేతుల మీదుగా చేయబోతున్నారు. ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని పూరి జగన్నాథ్ మరియు సంపూర్ణేష్ బాబు పేస్ బుక్ పేజీలో లైవ్ చూడవచ్చు.