ఫ్యాన్స్‌ను నిరాశ ప‌రిచిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌


ప‌వ‌న్ కళ్యాణ్ కాట‌మ‌రాయుడు టీజ‌ర్ మరోసార వెన‌క్కి వెళ్లింది. డాలీ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్, శృతి హాస‌న్ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా టీజ‌ర్ ను జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేస్తామ‌ని, ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేసిన కాట‌మ‌రాయుడు టీమ్, ఇప్పుడు మాట మార్చేసింది. ''జ‌వ‌న‌రి 26 న కాట‌మ‌రాయుడు టీజ‌ర్ రావడం లేదు, త్వ‌ర‌లోనే డేట్ అనౌన్స్ చేస్తాం..'' అంటూ నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ తెలిపాడు. అస‌లు టీజ‌ర్ రాక‌పోవ‌డానికి కార‌ణం ఏంటి, టీజ‌ర్ కు సంబంధించిన వ‌ర్క్ పెండింగ్ లో ఉందా..?, లేక క‌ట్ చేసిన టీజ‌ర్ ప‌వ‌న్ కు న‌చ్చ‌లేదా..? అస‌లు ఈ రెండూ కాదు. దానికి వేరే రీజ‌న్ ఉంది.

జ‌న‌వ‌రి 26న వైజాగ్ లో విద్యార్థులు ఏపీ కి స్పెష‌ల్ స్టేట‌స్ కోసం మౌన పోరాటం చేయడానికి నిర్ణ‌యించుకున్న త‌రుణంలో, ఈ పోరాటాన్ని ప్ర‌శాంతంగా కొన‌సాగిస్తే, జ‌న‌సేన మ‌ద్ద‌తు ప‌లుకుతుంద‌ని ట్విట్ట‌ర్ సాక్షిగా ప్ర‌క‌టించాడు జ‌న‌సేనాని. కాబ‌ట్టి ఆ రోజు అటు ప‌వ‌న్ కళ్యాణ్, ఇటు యువ‌త అంతా బిజీగా ఉంటారు కాబ‌ట్టి, టీజ‌ర్ రిలీజ్ చేసినా అంత‌గా క్లిక్ అవ‌దు అనుకుని క్యాన్సిల్ చేశార‌ని టాక్. ఇదిలా ఉండ‌గా, తమ అభిమాని టీజ‌ర్ కోసం ఎదురుచూసే ఎంతో మంది ఫ్యాన్స్ కు మాత్రం ఈ విష‌యం నిరాశనే మిగిల్చింది.

https://www.youtube.com/watch?v=rL65jrwcVtg