Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Kalyan Ram New Look In Puri Movie


ఎవ‌రీ అబ్బాయి..?
 
పూరీ జ‌గన్నాథ్. డేర్ అండ్ డాషింగ్ డైర‌క్ట‌ర్. పూరీ జ‌గ‌న్నాథ్ తో నా నెక్ట్స్ మూవీ అని ఏ హీరో అయినా అనౌన్స్ చేయడం ఆల‌స్యం, ఈ హీరోను పూరీ ఏ లుక్ లో చూపిస్తాడో, త‌మ అభిమాన న‌టుడు ఈసారి ఏ గెటప్ లో అవ‌తార‌మెత్తుతాడో అభిమానులు ఎంత‌గా వెయిట్ చేస్తారో చెప్ప‌న‌క్క‌ర్లేదు. పూరీ జ‌గ‌న్నాథ్ అంటే అలా ఉంటుంది మ‌రి. మొన్న త‌మ్ముడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ను టెంప‌ర్ లో స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేసిన పూరీ ఇప్పుడు అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ ను కూడా మార్చేశాడు. కొద్ది రోజుల క్రితం పూరీ , కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో వ‌స్తున్న సినిమా సెట్స్ మీద‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ చేస్తున్న జ‌ర్న‌లిస్టు పాత్ర కోసం క‌ళ్యాణ్ రామ్ కొత్త గెట‌ప్ లోకి మారిపోయాడు.
క‌ళ్యాణ్ రామ్ న్యూలుక్ ని పూరీ ట్విట్ట‌ర్ లో అప్ లోడ్ చేయ‌డం ఆల‌స్యం వెంట‌నే ఆ ఫోటో వైర‌ల్ అయిపోయింది. వ‌రుస‌గా రెండు ఫెయిల్యూర్ల త‌ర్వాత త‌నంటే ప్రూవ్ చేసుకోవాల్సిన స్థితిలో ఉన్న పూరీ, క‌ళ్యాణ్ రామ్ కోసం ఒక ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ రెడీ చేశాడ‌ని చెబుతున్నారు. క‌ళ్యాణ్ రామ్ కూడా షేర్ త‌ర్వాత మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర చేస్తుండటం విశేషం. మిస్ ఇండియా అదితి ఆర్య కథానాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామే ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ మీద ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నాడు.