Latest News

నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా ఆనందో బ్ర‌హ్మ: కొంచెం న‌వ్వులు .... గంపెడు నీర‌సం ఆగ‌స్టు 21న సర్ ప్రైజ్ ఇవ్వనున్న అఖిల్ మంచు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై ల‌క్ష్మి మంచు ప్ర‌ధాన పాత్ర‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.4 ప్రారంభం పవన్ కళ్యాణ్ పాటను ఆవిష్కరించిన 'మా' అధ్యక్షులు శివాజీరాజా మాఫియా నేపధ్యంలో "హైటెక్ కిల్లర్ " 'ఆనందోబ్ర‌హ్మ' మూవీ రివ్యూ ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం

శ్రీ కొణిజేటి రోశ‌య్య ఆవిష్క‌ర‌ణ‌లో `క‌ల్ప‌నా 3` పోస్ట‌ర్‌


ప్రియ‌మ‌ణి ఈజ్ బ్యాక్‌. టాలీవుడ్‌లో ద‌శాబ్ధం పైగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన ప్రియ‌మ‌ణి కాస్త గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తిరిగి వ‌స్తోంది. ఎ, ఉపేంద్ర‌, క‌న్యాదానం, సూప‌ర్‌ వంటి విల‌క్ష‌ణ‌మైన సినిమాలతో తెలుగులో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న ఉపేంద్ర ఇటీవ‌లే `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రంలో ఓ వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ఓ సినిమా తెలుగులో వ‌స్తోంది. ఉపేంద్ర - ప్రియ‌మ‌ణి నాయ‌కానాయిక‌లుగా న‌టించిన `క‌ల్ప‌నా 3` పోస్ట‌ర్‌ని మాజీ గ‌వ‌ర్న‌ర్ శ్రీ కొణిజేటి రోశ‌య్య ఉగాది సంద‌ర్భంగా నేడు హైద‌రాబాద్‌లో లాంచ్ చేశారు. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ ఏప్రిల్ 21న‌ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సీనియ‌ర్ న‌టి తుల‌సీ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రానికి ఆర్‌. ఉద‌య‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.