Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

జాగ్ర‌త్త‌..న‌వంబ‌ర్ 11న కాళ‌రాత్రి


"ఆడోరకం ఈడోరకం ",స్పీడ్ ఉన్నోడు" ,జాదూగాడు" లాంటి చిత్ర్రాలలో నటించిన సోనారిక ప్రధాన పాత్రలో"కాళరాత్రి "చిత్రం తెరకెక్కింది . లక్ష్మి టాకీస్ సమర్పణలో" సూర్యదేవ్ ఫిలిమ్ కార్పొరేషన్"పతాకం పై గుడి వంశీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు . ఈ చిత్రం నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ"దెయ్యాలు రేప్ చేస్తాయా ... అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము" . ఇప్పటి వరకు వచ్చిన హర్రర్ చిత్రాలకు బిన్నంగా ఈ చిత్రం ఉంటుంది . సోనారిక అద్భుతమైన నటనతో ఈ చిత్రంలో యువత ను కనువిందు చేస్తుంది .నవంబర్ 11 న ఆంధ్ర మరియు తెలంగాణ లలో ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్ లలో రిలీజ్ చేయనున్నాం అని అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ :లక్ష్మి టాకీస్ , సంగీతం :వివేక్ ,కెమెరా :జావేద్ ,నిర్మాత :గుడి వంశీధర్ రెడ్డి ,కథ స్క్రీన్ ప్లే ,దర్శకత్వం :రాజీవ్