దానికోసం కాజ‌ల్ ఓవ‌ర్ రియాక్ష‌న్


ఇప్పటివరకూ ఖైదీనెం.150కి సంబంధించిన లుక్స్ ప‌రంగా చిరంజీవి లుక్ మాత్ర‌మే రివీల్ చేసింది కానీ,  మెగాస్టార్- కాజ‌ల్ క‌లిసి ఉన్న లుక్ ని మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు రివీల్ చేయ‌లేదు. చిరంజీవి, కాజ‌ల్ జంట ఎలా ఉండబోతుంది అని అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న త‌రుణంలో అంద‌రికి ఒక ఫొటో పోస్ట్ తో సమాధానం చెప్పేసింది ఖైదీ టీమ్.
 
మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న‌ పక్కన చందమామ.. వాటే లుక్.. ఇద్ద‌రు అదిరిపోయారంతే.  కొత్త హెయిర్ స్టైల్ తో, లుక్ ప‌రంగా యంగ్ గా మారిపోయిన చిరంజీవి.. ఆయన పెదాలపై నవ్వు.. చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు. దానికితోడు పక్కనే ఉన్న కాజల్ ఎంత అందంగా కనిపిస్తోందో చెప్పేందుకు మాటలు కూడా కష్టమే. అయితే ఈ ఫోటో షేర్ చేసేందుకు కాజల్ కొంచెం ఓవ‌ర్ గానే రియాక్ష‌న్ చూపించిందండోయ్..  ఖైదీ యూనిట్ కంటే ఐదు నిమిషాల ముందే ఫొటోను ట్విట్టర్ లో పెట్టేసింది ఈ చంద‌మామ‌. ఈ ఒక్క ఫొటోతో చిరంజీవి, కాజ‌ల్ ఎలా ఉండ‌నున్నారా అనుకుంటున్న వారి ఆలోచ‌న‌ల‌కు చెక్  పెట్టేసింది కాజ‌ల్.