కాజల్‌ చేతుల మీదుగా 'ఒక్కడొచ్చాడు' టీజర్‌ విడుదల


మాస్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. సురాజ్ దర్శకుడు. నవంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రం యొక్క టీజర్ ను హీరోయిన్ కాజల్ ఈరోజు (అక్టోబర్‌ 21) సాయంత్రం 6 గంటలకు విడుదల చేసింది.  నవంబర్‌ మొదటి వారంలో ఆడియో, నవంబర్‌లోనే సినిమా కూడా విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. మాస్‌ హీరో విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, ఎడిటింగ్‌: ఆర్‌.కె.సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.