Kajal Lafzoon ki Kahaani Talk In Bollywood


కాజ‌ల్ కు అక్క‌డా చుక్కెదురే..
ఈఏడాది త‌నకు అస‌లు క‌లిసి రావ‌ట్లేద‌ని కాజ‌ల్ తెగ ఫీల‌యిపోతుంది. నిజంగా చెప్పుకోవాలంటే కాజ‌ల్ ఈ ఏడాది తెలుగులో చేసిన రెండు సినిమాలు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్, బ్ర‌హ్మోత్స‌వం. ఈ రెండు భారీ బ‌డ్జెట్ తో రూపొందిన‌వే. రెండు సినిమాలూ ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలు క‌లిగించిన‌వే. కానీ అవి బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డి నిరాశ‌నే మిగిల్చాయి. ఈ నేప‌థ్యంలో ర‌ణ‌దీప్ హుడా జంట‌గా కాజ‌ల్ న‌టించిన ''దో లఫ్జోం కీ క‌హానీ'' సినిమా ఇటీవ‌లే రిలీజ్ అయింది.
ముందు వ‌చ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అవ‌డంతో కాజ‌ల్ ఈ సినిమాపైనే బాగా ఆశ‌లు పెట్టుకుంది. ఈ సినిమాలో కాజ‌ల్, ర‌ణ‌దీప్ హుడా మ‌ధ్య లిప్ లాక్ ను కూడా బాగానే హైలెట్ చేశారు.కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోలేక‌పోయిందంటున్న‌ప్ప‌టికీ, కాజ‌ల్ మాత్రం త‌న న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లే ద‌క్కుతున్నాయ‌ని చెప్పుకొస్తుంది. తెలుగు సినిమాల కొదువ బాలీవుడ్ అయినా తీరుస్తుంది అని కాజ‌ల్ అనుకుంటే, ఈ బాలీవుడ్ మూవీ మాత్రం ఆమెకి మ‌రింత నిరుత్సాహాన్నే మిగిల్చిందంటున్నారు.